టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి అస్సలు క్రేజ్ లేదనేది జగమెరిగిన సత్యం. అందుకే ఇక్కడి తెలుగు హీరోయిన్స్ మొత్తం పరభాషా హీరోయిన్స్ గా పక్కరాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. మనమేమో పక్కా భాష హీరోయిన్స్ వెంటపడుతున్నాం. అంజలి, స్వాతి, బిందుమాధవి, తాజాగా నిహారిక వంటి హీరోయిన్స్ మొత్తం పక్కా భాషల్లో తమ క్రేజ్ చూపిస్తున్నారు. అయితే ఇక్కడ టాలీవుడ్ లో ఒక తెలుగు హీరోయిన్ మాత్రం ఇప్పుడు అవకాశాలను ఒడిసి పట్టుకుంటుంది. చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్ కేరెక్టర్స్ చేసినా ఈషా రెబ్బా 'అమీతుమీ' లో హీరోయిన్ గా 'అ!' సినిమాలో డిఫరెంట్ కేరెక్టర్ లో అలరించింది. ఇప్పుడు 'బ్రాండ్ బాబు' సినిమాలో ఈషా సోలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా వచ్చే శుక్రవారమే విడుదల కాబోతుంది.
ఇక త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత - వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఆ సినిమాలో ఏదో అలా వచ్చి వెళ్లిపోయే పాత్ర కాదని.. ఒక పాటలో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్స్ వెయ్యడమే కాదు.. సినిమా మొత్తం ఎన్టీఆర్ పక్కనే ఉండే పాత్ర అని చెప్పింది. ఇక ఇలా చిన్నగా అవకాశాలు పట్టేస్తున్న ఈషా రెబ్బకి ఇప్పుడు ఒక యంగ్ హీరో పక్కన ఛాన్స్ వచ్చినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఛలో సినిమాతో హిట్ కొట్టిన నాగశౌర్య తన ఓన్ బ్యానర్లో నర్తనశాల సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే నాగశౌర్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని భవ్య క్రియేషన్స్ లో చేయనున్నాడు. ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది కూడా.
ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ నిర్మించబోయే సినిమాలో నాగశౌర్య పక్కన ఈషా రెబ్బ హీరోయిన్ గా ఎంపిక అయినట్లుగా తెలుస్తుంది. మరి నాగశౌర్య ఎప్పుడూ కొత్త హీరోయిన్స్ కే ఎక్కువగా అవకాశాలిస్తాడు. మరి ఇప్పుడు ఈషా తో సినిమా చెయ్యడానికి ఎలా ఒప్పుకున్నాడో తెలియదు కానీ.. ఈ అవకాశంతో ఓ తెలుగు అమ్మాయికి అవకాశం వరించినట్లయింది. మరి శౌర్య సినిమా డైరెక్టర్ పేరు తో పాటుగా ఈషా రెబ్బ పేరును కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇక నిజంగా ఈషా రెబ్బాకి ఈ సినిమాలో ఛాన్స్ వస్తే గనక నాగ శౌర్య క్రేజ్ తో ఈ అమ్మాయి నిలదొక్కుకుంటుందేమో చూద్దాం.