మనుషుల మనస్తత్వాలు ఒక్కో విధంగా ఉంటాయి. కొందరిని వారు ఎంతగానో అభినందిస్తూ, మరికొందరిపై మాత్రం ఫైర్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు సమంతతో పాటు పలువురు నటీనటుల పట్ల పాజిటివ్‌గా స్పందించేవారు అనసూయ, రేష్మి, తాప్సిపన్ను వంటి వారిని మాత్రం శత్రువులుగా చూస్తూ ఉంటారు. వారు మాట్లాడే విధానం, డ్రస్సింగ్‌లు, వివాదాలు, వారు చేసే అనుచితవ్యాఖ్యల వంటివి ప్రేక్షకులకు కోపం తెప్పిస్తాయని భావించాల్సి ఉంటుంది. ఈ రకమైన కోవకి చెందిన హీరోయినే తాప్సిపన్ను. దక్షిణాదిలో అందునా టాలీవుడ్‌లో ఈమె టాప్ డైరెక్టర్స్‌తో పనిచేసినా కూడా ప్రేక్షకులు ఆమెని ఇష్టపడలేదు. ఆమెకంటూ 'ఆనందోబ్రహ్మ' తప్ప మరో హిట్ లేదు. ఎందుకో ఏమో గానీ ఆమెని ప్రేక్షకులు ఆదరించలేదు. దాంతో ఆమె బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ పర్‌ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో పాటు గ్లామర్ హీరయిన్‌గా కూడా దూసుకెళుతోంది.
ఇక విషయానికి వస్తే సోషల్‌మీడియాలో ఆకతాయిలు ఎక్కువైపోతున్నారు. వారి ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. వారు కొందరిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. వీరిలో సామాన్యులతో పాటు సిని, రాజకీయ, క్రీడాప్రముఖులు కూడా వీరి బారిన పడుతున్నారు. ఈ సొట్టబుగ్గల సుందరిని కొందరు ట్విట్టర్‌లో వేధించే ప్రయత్నం చేశారు. అయితే ఆమె కూడా దానికి ధీటుగానే సమాధానం ఇచ్చింది. సూరజ్ అనే ట్విట్టర్ యూజర్ తాప్సిని ఉద్దేశించి, బాలీవుడ్‌లో అత్యంత చెత్తగా కనిపించే హీరోయిన్ తాప్సినే. మళ్లీమళ్లీ ఆమెని చూడాలని అనుకోవడం లేదు. మరో రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత ఆమె మాయమైపోతుంది.. అని వెక్కిరించాడు. దానికి తాప్సి సమధానం ఇస్తూ, అయ్యో ఇప్పటికే నా మూడు చిత్రాలు ముల్క్, మన్మర్జియాన్, బద్లా చిత్రాలు పూర్తి అయిపోయాయి. మిమ్మల్నినిరాశపరిచినందుకు క్షమించండి. మరో రెండు చిత్రాలకు నేను సంతకం కూడా పెట్టేశాను. నన్ను ఇంకొంత కాలం భరించక తప్పదు అని వ్యంగ్యంగా స్పందించింది.
ఇంతలో రోహిత్ అనే నెటిజన్ అయ్యో మిమ్మల్ని భరించడం ఏమిటి? మీ సినిమాలే చూడను. చూడాలనిపించదు కాబట్టి అవి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయో కూడా నాకస్సలు తెలియదు. మీకొత్త మూవీ ముల్క్ చిత్రం ప్రమోషన్ కోసం మీరు వేసే వేషాలు చూడటానికే మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. దీనికి తాప్సి సమాధానం ఇస్తూ, అంటే నేను మీకు వినోదం అందిస్తున్నట్లే కదా..! ఆ విధంగా చూసుకుంటే నటిగా నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నట్లే .దయచేసి మీ అభిరుచిని మార్చుకోండి. అప్పుడే మీరు ఎవరి సినిమా అయినా చూడగలరు అని తెలిపింది. ఇక తాప్సి నటిగా పింక్, బేబీ వంటి చిత్రాలలో నటనతో, 'జుడ్వా 2' వంటి చిత్రాలలో బికినీతో గ్లామర్‌షో.. ఇలా రెండు విధాలుగా రాణిస్తుండడం విశేషం.