సినిమాలలో చాన్స్‌లు కోరే మహిళలకు లైంగిక వేధింపులు సాధారణమని అందరూ ఒప్పుకుంటారు. దీంతో కాస్టింగ్‌కౌచ్ పేరుతో ఎన్నో వివాదాలు తెరపైకి వస్తుంటాయి. ఇక లైంగికంగా వాడుకుని సినిమా చాన్స్‌లు ఇచ్చేవారు కొందరైతే, అవకాశం ఇస్తామని చెప్పి వాడుకుని సినిమాలలో చాన్స్‌లు ఇవ్వని పెద్దమనుషులు కూడా ఉంటారు. ముఖ్యంగా కొత్తగా వచ్చే దర్శక నిర్మాతల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. ఇక నటులు కావాలని భావించే యువకులకు కూడా లైంగిక వేధింపులు ఉంటాయని ఇప్పటికే ఎందరో చెప్పారు. లేడీ నిర్మాతలు ఇష్టపడిన యువకులను వారి సుఖం తీర్చేలా చేయమనే బలవంతం ఉంటూనే ఉంటుందని, మరీ ముఖ్యంగా హోమోసెక్స్‌వల్స్ అయిన వారి నుంచి సినీ పరిశ్రమలో చాన్స్‌ల కోసం ఎదురు చూసే వారికి వేధింపులు కూడా ఉంటాయి. ఇవేకాదు.. సినిమా ఇండస్ట్రీలో బయటకి రాని మోసాలు ఎన్నో ఉంటాయి.
కథా చౌర్యం నుంచి ఈ సినిమాలో నిన్నే హీరోగా పెట్టుకుంటాం. కాస్త బడ్జెట్ తగ్గింది. కాబట్టి డబ్బులు ఇస్తే మా చిత్రంలో నువ్వే హీరోవి అని కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఇలా మోసపోయిన వారు ఎందరో ఉన్నా.. వారు బయటికి వచ్చి ఆ విషయాలను చెప్పుకోలేరు. తెలిసి తెలిసి ఎలా మోసపోయావని ఎగతాళి చేసే వారు కూడా ఉన్నారు. ఇక ఇటీవల రాంగోపాల్‌వర్మ శిష్యుడు అజయ్‌భూపతి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్‌ఎక్స్ 100' చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రంతో కార్తికేయ హీరోగా పరిచయం అయ్యాడు. ఈయన కూడా ఇలా మోసాల బారిన పడ్డాడట. పలువురు నిర్మాతలు లక్షరూపాయలు ఇవ్వు.. నువ్వే హీరో అని నమ్మించారని, అలా చాలా మందికి లక్షలు ఇచ్చాను.
కానీ ఆ తర్వాత వారి ఫోనులు స్విచ్చాఫ్ అయిపోయేవి. ఆఫీసులు కూడా ఎత్తివేసి కనిపించకుండా పోయే వారు. ఇలా ఎన్నోచోట్ల మోసపోయిన నాకు అజయ్‌భూపతి 'ఆర్‌ఎక్స్ 100'లో చాన్స్ ఇవ్వడంతో నన్ను నేను నిరూపించుకున్నానని కార్తికేయ సంచలన విషయాన్ని పక్కాగా బయటపెట్టాడు. కార్తికేయ ఆల్‌రెడీ ప్రూవ్ చేసుకున్న నటుడు కాబట్టి దీనిపై చర్చ సాగుతోంది. కానీ బయట పడని, బయట పెట్టని వారు ఎందరో ఉన్నారని, వీరంతా పురుష బాధుతులని, డబ్బురూపేణ మోసపోయిన వారని అర్ధమవుతోంది...!