దక్షిణాదిలో బిజెపికి పూర్తిగా కనుమరుగవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ, తమిళనాడులలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అంచనా వేస్తున్నారు. ఏదైనా ఒకటి అరా సీట్లు వస్తే అది కర్ణాటక, తెలంగాణలో మాత్రమేనని ఆ పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే ఏ పార్టీ అయినా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు ఉండే ఉత్తరాదిలో గెలిస్తే చాలనే వాదన కూడా ఉంది. మరి బిజెపి, మరీ ముఖ్యంగా మోదీపై ఉత్తరాదిలో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఆయన బలం అక్కడ ఇంకా 2014లాగానే ఉందా? లేక కాంగ్రెస్ పుంజుకుంటుందా? బిజెపికి ఎక్కువ సీట్లు ఉత్తరాదిలో వస్తాయా? మోదీ మీద అక్కడి ప్రజల ఉద్దేశ్యం ఎలా ఉంది? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు ఉత్తరాదిలో కూడా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నదని బిజెపికి దళితులు, ముస్లింలు దూరంగా జరుగుతున్నారని, ఇక పటేళ్లకు కూడా బిజెపిలో పట్టు పోయిందని కొన్నిమీడియాలు కథనాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక మోదీ విషయానికి వస్తే ఆయనకు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అంబానీలు, అదానీల నుంచి సెలబ్రిటీలలో ఆయనకు మంచి పట్టు ఉంది. సల్మాన్‌ఖాన్ నుంచి ప్రియాంకాచోప్రా, కంగనారౌనత్ వంటి వారికి ఆయన బాగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ఆయన జల్సారాయుడు కాబట్టి సినీ ప్రముఖులను కూడా బాగా పొగుడుతుంటాడు. ఇక విషయానికి వస్తే జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత, ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన క్వీన్ కంగనారౌనత్. ఈమె తాజాగా మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ నికార్సయిన ప్రజానాయకుడని ఆమె కితాబునిచ్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా మోదీకి మరో అవకాశం ఇవ్వాలని, ప్రజాస్వామ్యానికి మోదీ సరైన వ్యక్తి అని తెలిపింది. మోదీ జీవితంలోని ఘటనల ఆధారంగా రూపొందిన 32 నిమిషాల 'ఛలో జీతేహై' అనే షార్ట్ ఫిల్మ్ రూపొందింది. ముంబైలో ఏర్పాటు చేసిన ఈ ఫిల్మ్ స్పెషల్ స్క్రీనింగ్‌కి ఆమె కూడా హాజరైంది.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... మోదీ జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయనకు ప్రధానిగా మరో అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలి. ఆయన ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చే వ్యక్తి. ఆ పదవికి ఆయనే అర్హుడు. మోదీ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన బాల్యాన్ని అద్భుతంగా చూపారని ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. ఆనంద్ ఎల్.రాయ్, మహావీర్‌జైన్‌లు దీనికి దర్శకత్వం వహించారు.