Advertisementt

నితిన్ సినిమా పెళ్లి వేడుక భలే వుంది..!

Wed 01st Aug 2018 11:19 AM
nithin,raashi khanna,srinivasa kalyanam,making video,dil raju  నితిన్ సినిమా పెళ్లి వేడుక భలే వుంది..!
Srinivasa Kalyanam Making Video Released నితిన్ సినిమా పెళ్లి వేడుక భలే వుంది..!
Advertisement
Ads by CJ

పెళ్లిళ్లు, కుటుంబాలు, బంధాల వంటివి చూపించే చిత్రాలలో తెరనిండా నటీనటులు ఉంటూ ఎంతో కళగా ఉంటాయి. 'మురారి, గోవిందుడు అందరివాడేలే, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, శతమానం భవతి'తో పాటు ఎన్నో చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. ఆ కోవకి సంబంధించి వస్తున్న మరో చిత్రమే దిల్‌రాజు నిర్మాణంలో 'శతమానంభవతి' దర్శకుడు సతీష్‌ వేగేశ్న తీస్తున్న 'శ్రీనివాసకళ్యాణం' చిత్రం. ఇందులో నితిన్‌, రాశిఖన్నా, ప్రకాష్‌రాజ్‌ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. పేరులోనే కళ్యాణం ఉంది కాబట్టి ఈ చిత్రం కూడా కృష్ణవంశీ, శ్రీకాంత్‌ అడ్డాలలో కోవలోకే వస్తుందనే టాక్‌ వచ్చింది. సతీష్‌వేగేశ్నకి వారి సరసన ఈ చిత్రంతో చోటు దక్కడం ఖాయమంటున్నారు.

ఇక ఈ చిత్రం ప్రమోషన్ల వేగాన్ని కూడా పెంచారు. ఆగష్టు9న విడుదలకు సిద్దమవుతోన్న 'శ్రీనివాస కళ్యాణం'కి సంబంధించిన ఓ నాలుగు నిమిషాల నిడివి కలిగిన మేకింగ్‌ వీడియోను యూనిట్‌ విడుదల చేసింది. వీటిలో అన్ని పెళ్లి సీన్లే ఉండటం విశేషం. నితిన్‌ని పెళ్లికొడుకును చేయడం నుంచి, నితిన్‌, రాశిఖన్నాలు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకునే వరకు ఇందులో క్లుప్తంగా చూపించారు. దీంతో ఇది సినిమా విడుదలకు ముందు విడుదలైన మినీ మ్యారేజ్‌ అన్నట్లుగా ఉంది. దాదాపు 60మంది ఆర్టిస్టులతో ఈ పెళ్లివేడుక ఎంతో కళకళలాడుతూ ఉంది. 

ఇక దిల్‌రాజు మొదటి చిత్రం అయిన దిల్‌ తర్వాత ఇంతకాలానికి నితిన్‌తో ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. 'తొలిప్రేమ' తర్వాత మరోసారి ఈ చిత్రంతో నటి రాశిఖన్నా తన టాలెంట్‌ని ప్రూవ్‌ చేయాలని ఆరాటపడుతోంది. ఇక నితిన్‌కి హీరోగా వరుసగా రెండు ఫ్లాప్‌లు రావడం, సతీష్‌వేగేశ్న 'శతమానం భవతి' తర్వాత ఈ చిత్రం హిట్‌ అయితే ఫ్యామిలీ చిత్రాల దర్శకులు లేని కొరతను తీర్చినట్లు అవుతుందనే చెప్పాలి...! 

Click Here For Video

Srinivasa Kalyanam Making Video Released:

Nithin Srinivasa Kalyanam Movie Latest Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ