Advertisementt

'సువర్ణ సుందరి' విశేషం ఇదే..!

Thu 02nd Aug 2018 12:51 PM
suvarna sundari,jayapradha,poorna,daughter  'సువర్ణ సుందరి' విశేషం ఇదే..!
Suvarna Sundari Teaser Released 'సువర్ణ సుందరి' విశేషం ఇదే..!
Advertisement
Ads by CJ

ఓ సినిమాకు కంటెంట్ ఎంత ముఖ్యమో, చూసే ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్ పీరియస్ కూడా అంతే ముఖ్యం. హాలీవుడ్ అవెంజర్స్ నుంచి టాలీవుడ్ బాహుబలి వరకు వచ్చిన భారీ చిత్రాలన్ని ఆడియెన్స్ కు ఆ అనుభవాన్ని అందించాయి. ఇప్పుడదే కోవలో సువర్ణసుందరి తెరకెక్కింది‌. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది అన్న ట్యాగ్ లైన్ తో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కుతోన్న సువర్ణ సుందరి కంటెంట్ అండ్ క్యారెక్టరైజేషన్స్ విషయంలోనూ ఓ థ్రిల్లింగ్ మూవీగా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ రూపొందిస్తున్నారు. హిస్టారికల్ అడ్వెంచర్ గా వస్తొన్న ఈ చిత్రంలో పూర్ణ కూతురుగా జయప్రద నటిస్తుండటం మరో విశేషం.ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనటానికి ఓ హింట్ ఇచ్చినట్లయింది. దర్శకుడు సూర్య టేకింగ్ తో పాటు, విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కల్గిస్తాయి.

సినిమాటోగ్రాఫర్ ఎలు మహంతి విజువల్స్, సాయి కార్తీక్ స్టన్నింగ్ ఆర్.ఆర్ వెరసి సువర్ణ సుందరి టీజర్ టెక్నికల్లి బ్రిలియెంట్ గా ఉందన్న ఫీడ్ బ్యాక్ ఆడియెన్స్ నుంచి వినిపిస్తోంది. ఇక అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సువర్ణ సుందరి సెప్టెంబర్ లో  ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్, ఇంద్ర,జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్, ముక్తార్ ఖాన్, అవినాష్,కె.జగదీష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న చిత్రానికి సినిమాటొగ్రఫీ: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్,ఎడిటర్: ప్రవీణ్ పూడి  పి.ఆర్‌.ఓ: సాయి సతీష్,  నిర్మాణం : ఎస్ టీమ్ పిక్చర్స్, సమర్పణ: ఎం.వి.కె.రెడ్డి, నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ. దర్శకుడు: సూర్య ఎమ్.ఎస్.ఎన్.

Suvarna Sundari Teaser Released:

Jayaprada has played Poorna’s daughter in Suvarna Sundari

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ