Advertisementt

ఆ క్లబ్‌లో.. శ్రీదేవి కూతురు కూడా!!

Fri 03rd Aug 2018 10:13 AM
jhanvi kapoor,dhadak movie,100 crore club,worldwide  ఆ క్లబ్‌లో.. శ్రీదేవి కూతురు కూడా!!
Janhvi Kapoor's Dhadak crosses Rs 100 crore mark worldwide ఆ క్లబ్‌లో.. శ్రీదేవి కూతురు కూడా!!
Advertisement
Ads by CJ

ఏ నటికైనా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే తమ మొదటి చిత్రమే 100కోట్ల క్లబ్‌లో చేరితే ఆనందించని వారు ఉండరు. ఇక విషయానికి వస్తే మరాఠిలో పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయిన 'సైరత్‌'కి రీమేక్‌లో బాలీవుడ్‌లో 'ధడక్‌' చిత్రం రూపొంది విడుదలైంది.శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించగా, కరణ్‌జోహార్‌, అపూర్వమెహతాలు దీనిని సంయుక్తంగా నిర్మించారు. జూలై20న విడుదలైన ఈ చిత్రం ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి పెద్దకుమార్తె జాన్వికపూర్‌ హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. మరోవైపు ఇందులో ఇషాన్‌ఖట్టర్‌ ఆమెకి జోడీగా నటించాడు. ఈ చిత్రం విడుదలైన 10రోజులలోనే 100కోట్ల గ్రాస్‌ని వసూలు చేసి 100కోట్ల క్లబ్‌లో చేరింది. యూత్‌ని విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ చిత్రం జాన్వికి మొదటి చిత్రమే అయినా నటన, గ్లామర్‌ పరంగా మంచి మార్కులు కొట్టేసి కాబోయే స్టార్‌ హీరోయిన్‌ అని పొగడ్తలను అందుకుంటోంది. 

కాగా ఈ చిత్రం 100కోట్లు వసూలు చేయడానికి మూలకారణం ఇందులో శ్రీదేవి కూతురు జాన్వి నటించడమేనని చెప్పాలి. ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇక జాన్వి నటించే రెండో చిత్రం ఏమిటి? అని అందరిలో ఆసక్తి ఏర్పడింది. అయితే రెండో చిత్రాన్ని మాత్రం రీమేక్‌ కాకుండా స్ట్రెయిట్‌ చిత్రం చేస్తానని జాన్వి చెబుతోంది. అకాల మరణం పాలైన అతిలోక సుందరి శ్రీదేవి బతికుంటే ఖచ్చితంగా ఆమె ఎంతగానో సంతోషించి ఉండేదని చెప్పాల్సిన పనిలేదు. 

ఇక శ్రీదేవి బాలీవుడ్‌ను ఏలినా కూడా దక్షిణాదిలో ఎన్నో చిత్రాలు చేసింది. మరి ఆమె కూతురు జాన్వి కూడా దక్షిణాది చిత్రాలనుఒప్పుకుంటుందా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది. ఆమె ఓకే అనాలే గానీ ఎంత పారితోషికం ఇచ్చి అయినా ఆమెని తమ చిత్రంలో హీరోయిన్‌గా తీసుకోవాలని పలువురు తెలుగు భారీ నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారి ఆశ నెరవేరుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..! 

Janhvi Kapoor's Dhadak crosses Rs 100 crore mark worldwide:

Jhanvi kapoor's Dhadak Movie Joins 100 Crore Club

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ