ప్రస్తుతం రణబీర్‌కపూర్ మంచి జోష్ మీద ఉన్నాడు. 'సంజు' చిత్రం ఘనవిజయం సాధించడం, దానిలో సంజు పాత్రను చేసిన ఆయనకు మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ బాంబ్ అలియాభట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇక సినిమాల ద్వారా కంటే ఈయన వివిధ హీరోయిన్లతో నడిపిన ఎఫైర్ల ద్వారానే ఎంతో కాలంగా వార్తల్లో ఉంటు ఉన్నాడు.
ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ, సంజుకి 308 మంది ఉన్నారు. కానీ నా ప్రియురాళ్ల సంఖ్య పదికి కూడా చేరలేదు.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అలియాభట్‌తో తన ప్రేమాయణం గురించి చెబుతూ, 'ప్రేమలో పడటం ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. కొత్త మనిషి, కొత్త ఆలోచనలు వస్తాయి. అయితే నేను ఇప్పుడు బాగా మారాను. బంధాలకు విలువ ఇవ్వడం ప్రారంభించాను' అని చెప్పుకొచ్చాడు. ఇక దీపికా పదుకొనెతో తన ఎఫైర్ బ్రేకప్ గురించి ఆయన మాట్లాడుతూ, అవును.. నేను, నా గర్ల్‌ఫ్రెండ్‌ని మోసం చేశాను. అపరిపక్వత, అనుబంధాలను పటిష్టం చేసుకునే నేర్పు లేకపోవడం, అడ్వాంటేజ్ తీసుకోవడం వంటివన్నీ నా తప్పులే. కానీ ప్రస్తుతం నేను రియలైజ్ అయ్యాను.
ఇక కత్రినా విషయంలో కూడా తనదే తప్పని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు. మరి రణబీర్ నిజంగా మారాడా? లేదా కేవలం మారినట్లు ఫోజులిస్తూ అలియాభట్‌ని ఇంప్రెస్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడా? అనేది వేచిచూడాల్సివుంది..!