Advertisementt

'సై రా' వెనుక ఏ..దో జరుగుతున్నట్లుంది..!!

Fri 03rd Aug 2018 02:42 PM
uyyalawada narasimha reddy,sye raa,chiranjeevi,ram charan,surender reddy,troubles,controversy  'సై రా' వెనుక ఏ..దో జరుగుతున్నట్లుంది..!!
Another Controversy on Chiranjeevi Sye Raa 'సై రా' వెనుక ఏ..దో జరుగుతున్నట్లుంది..!!
Advertisement
Ads by CJ

చిరంజీవి - రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. అసలే మొన్నటి వరకు సినిమా షూటింగ్ నత్తనడకన నడిచేసరికి.. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో అయినా విడుదలవుతుందా అనే అనుమానంలో వున్న ప్రేక్షకులకు... సై రా షూటింగ్ జెట్ స్పీడులో జరుగుతుందనేలా హైదరాబాద్ షెడ్యూల్ సాగింది. అయితే సై రా సినిమా చుట్టూ సమస్యలు చుట్టుకుంటున్నాయి. అందులో మొన్నటికి మొన్న సై రా నరసింహారెడ్డి సినిమా కోసం వేసిన సెట్ ని రెవిన్యూ అధికారులు కూల్చేసినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఆ స్థలం ప్రభుత్వ స్థలం కావడం.. అనుమతులు లేకుండా సై రా కోసం సెట్ నిర్మించగా... ఆ సెట్ ని తాజాగా రెవిన్యూ అధికారులు కూల్చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

అదలా ఉండగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలవ్వకముందు సై రా సినిమా దర్శకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబందించిన పూర్వీకులను కలుసుకుని ఉయ్యాలవాడ చరిత్రని తెలుసుకుని మరి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లారు. అయితే ఈ సినిమాకి ఉయ్యాలవాడ అనే టైటిల్ పెట్టకుండా సై రా అనే టైటిల్ పెట్టినప్పుడు ఉయ్యాలవాడ బంధువులు కాస్త చిన్నబుచ్చుకున్నప్పటికీ.. మళ్ళీ సైలెంట్ అయ్యారు. మళ్ళీ సై రా షూటింగ్ 30 నుండి 40 శాతం కంప్లీట్ అయ్యాక... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాని నిర్మిస్తున్నందుకు తమకు సంతోషంగానే ఉన్నప్పటికీ.. తమకి కనీస గుర్తింపును సై రా చిత్ర బృందం ఇవ్వడం లేదని... ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాహసాలను సై రా నరసింహారెడ్డిగా అందరికి అర్ధమయ్యే రీతిలో సినిమాగా చేస్తున్నందుకు తమకి చాలా సంతోషంగా ఉందని.. కానీ సై రా టీమ్ తమని పట్టించుకోవడంలేదని.... తామంతా చిరంజీవి, రామ్ చరణ్ తో మాట్లాడేందుకు కర్నూల్ నుండి హైదరాబాద్ కి తిరుగుతున్నామని.. కానీ చిరు కానీ, చరణ్ కానీ తమతో ఇంతవరకు మాట్లాడేందుకు ముందుకు రాలేదని... చిరంజీవి గారు మీతో మాట్లాడతారని  తమకి చెప్పి పంపిస్తున్నారని... అసలు తమ ఆవేదనని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ పని మాత్రం చేసుకుంటున్నారంటూ వారు తమ ఆవేదనని ఒక ఛానల్ సాక్షిగా వెళ్లగక్కారు. మరిలాంటి నెగెటివ్ న్యూస్ లు సై రా మీద రావడం కాస్త బాధాకర విషయమే అయినప్పటికీ సినిమాకి మాత్రం ఫ్రీగా పబ్లిసిటీ వచ్చేస్తుందని భావిస్తుందేమో సై రా టీమ్. లేదా కావాలనే ఎవరైనా ఈ సినిమాకి కష్టాలు కలిగిస్తున్నారు అనేది అనుమానించాల్సిన విషయమే మరి.

Another Controversy on Chiranjeevi Sye Raa:

Uyyalawada Narasimha Reddy Family Deeply Upset With Sye Raa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ