'ఉన్నది ఒకటే జిందగీ' తో యావరేజ్ అందుకున్న హీరో రామ్ చాలా గ్యాప్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో నక్కిన త్రినాథ రావుతో 'హలో గురు ప్రేమకోసమే' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని అక్టోబర్ లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ విషయాలేమి బయటికి రానివ్వడం లేదు. 'హలో గురు ప్రేమ కోసమే' టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ని వదిలిన చిత్ర బృందం ఇప్పుడు చాలా సైలెంట్ అయ్యింది. మరి ఈ సినిమా విషయంలో ఏదో జరుగుతుందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది.
అప్పుడప్పుడు రామ్ తన బాడీ ఫిట్నెస్ ని, అలాగే తాను వంట చేస్తున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అయితే రామ్ ట్విట్టర్ లో ఓ అభిమాని రామ్ ని 'హలో గురు ప్రేమ కోసమే' చిత్ర విషయాలను చెప్పమని అడగగా.. దానికి రామ్ లాల్ గట్టిగా అక్కడ అడగండి అంటూ దిల్ రాజుని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా.. ఆ అభిమానికి రామ్ చెప్పడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. అసలు ఈ కథ ముందుగా అక్కినేని అఖిల్ దగ్గరికి వెళ్ళింది. అఖిల్ నుండి ఆ స్టోరీ తర్వాత రామ్ చేతికి వచ్చింది. మధ్యలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయనుకోండి అది వేరే విషయం.
అయితే ప్రస్తుతం లవర్ సినిమా ప్లాప్ తో ఉన్న దిల్ రాజు ప్రస్తుతం తన దృష్టి మొత్తం శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ మీదే పెట్టాడు. అందుకేనా, మరెందుకో దిల్ రాజు.. త్రినాధరావు - రామ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాని లైట్ తీసుకుంటున్నాడా... లేదంటే మరేదన్న విషయం ఉందా అనేది అర్ధమవడం లేదు. కానీ రామ్ చెప్పిన దాన్నిబట్టి చూస్తుంటే మాత్రం ఏదో ఉందనే అర్ధం వస్తుంది. ఇక ప్రస్తుతం జరిగిన షూటింగ్ తో దిల్ రాజు సంతృప్తిగా లేడని.. అందుకే ఇలా హలో గురు ని పట్టించుకోవడం లేదంటున్నారు. మరో పక్క అనుపమకు వరసగా ప్లాప్స్ ఉన్నాయి. ఏదైనా ప్రస్తుతం అనుపమకు, రామ్ కి, త్రినాథరావుకి ముగ్గురికి ఈ సినిమా హిట్ అవసరం ఎంతో ఉంది. ఇకపోతే హలో గురు ప్రేమ కోసమే సినిమా అక్టోబర్ 18 విడుదల కానున్నట్లుగా డేట్ ప్రకటించారు.