Advertisementt

నాగ్.. మేనల్లుళ్ళ హవా నడుస్తోంది..!

Mon 06th Aug 2018 10:59 AM
nagarjuna,sumanth,sushanth,success movies,chi la sow,malli raava  నాగ్.. మేనల్లుళ్ళ హవా నడుస్తోంది..!
Sumanth and Sushanth Turns Successful Heroes నాగ్.. మేనల్లుళ్ళ హవా నడుస్తోంది..!
Advertisement
Ads by CJ

 

నాగార్జున కొడుకులు హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాల్లో దూసుకుపోతున్నారు. నాగ చైతన్య, అఖిల్ సినిమాలు హిట్ కాకపోయినా.. వారి మార్కెట్ మాత్రం తగ్గదు. నాగచైతన్య మీడియం రేంజ్ హీరోగా ఎప్పుడో నిలదొక్కుకున్నాడు. ఇక అఖిల్ కూడా ప్రస్తుతం ఆ దారిలోనే ఉన్నాడు. నాగార్జున తన కొడుకులిద్దరి కెరీర్ ని గాడిన పడెయ్యడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ అయన మేనల్లుళ్లే.. పాపం హీరోలుగా నిలదొక్కుకోలేక అష్టకష్ఠాలు పడుతున్నారు.

ప్రేమ కథ, సత్యం, గోల్కొండ హైస్కూల్ వంటి సినిమాల్తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. అక్కినేని నాగేశ్వరరావు ఆశీస్సులతో మొదలైన ఏమో గుర్రం ఎగరావచ్చు, నరుడా డోనారుడా సినిమాలు కూడా ప్లాప్ అవడంతో ఇక సుమంత్ సినిమాలు వదిలేస్తాడేమో అనుకున్నారు. ఒక పక్క సినిమాల్లో నిలబడలేక.. మరో పక్క కీర్తి రెడ్డి ని వివాహం చేసుకుని విడాకులు తీసుకుని జీవితంలోను ఒడిడుకులు పడిన సుమంత్ కి 'మళ్ళీ రావా' సినిమాతో విజయం దక్కింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మళ్ళీ రావా చిత్రం తో సుమంత్ మళ్లీ హీరోగా సెటిల్ అయినట్లే అనిపిస్తుంది. ఆ సినిమాలో సుమంత్ నటనకు మంచి మార్కులు పడడమే కాదు... ఆ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా హిట్ కూడా అయ్యింది. క్రిటిక్స్ నుండి ప్రేక్షకుల నుండి ఆ సినిమాకి మంచి మార్కులు పడ్డాయి. మరి హీరోగా సుమంత్ సత్యం సినిమా తర్వాత మళ్ళీ రావా సినిమానే హిట్ అంటే సుమంత్ మధ్యలో ఎన్ని ప్లాప్స్ చవి చూశాడో అర్ధమవుతుంది. మరి మళ్ళీ రావాలో నాగార్జున పెద్ద మేనల్లుడు సుమంత్ గాడినపడి ప్రస్తుతం ఇదం జగత్, సుబ్రహ్మణ్యంపురం సినిమాల్లో హీరోగా నటించడమే కాదు... తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్రలో నటించనున్నాడని టాక్ వినబడుతుంది.

ఇకపోతే నాగార్జున మరో మేనల్లుడు సుశాంత్ కూడా హీరోగా నిలదొక్కుకోవడానికి ఏళ్ళు పట్టింది. కరెంట్, కాళిదాసు, అడ్డా, ఆటాడుకుందాం రా... ఇలా తనకు సూట్ కానీ చిత్రాల్లో నటించి ప్లాప్ హీరో అనిపించుకున్నాడు. హీరోగా నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. ఆఖరుకి రాహుల్ రవీంద్రన్ దేవుడిలా సుశాంత్ కి చి. ల.సౌ తో హిట్ అందించాడు. ప్లాప్స్ లో ఉన్న సుశాంత్ ని రాహుల్ ఒడ్డున పడేశాడు. నటుడిగా రాహుల్ కి సరైన అవకాశాలు లేకపోవడంతో.. మంచి కథ తయారు చేసుకుని సుశాంత్ కి కథ వినిపించి ఓకే చేయించుకుని సుశాంత్ హీరోగా ఒక చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమాలో సుశాంత్ నటన, అతని లుక్స్ అన్ని బావున్నాయని ప్రేక్షకులతోపాటుగా క్రిటిక్స్ కూడా ముక్త కంఠంతో చెబుతున్న మాట. మరి చి. ల సౌ తో సుశాంత్ కూడా లైన్లోకి వచ్చేసినట్లే. సో ఆ విధంగా నాగార్జున మేనల్లుళ్లు ఒకేసారి తమ తమ సినిమాల్తో ప్రేక్షకులను మెప్పించి హీరోలుగా తమ తమ కెరీర్ ని రీ స్టార్ట్ చేశారు.

Sumanth and Sushanth Turns Successful Heroes:

Nagarjuna Happy with Sushanth and Sumanth Success

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ