Advertisementt

'గూఢచారి'లో చేయనందుకు సంతోషపడుతోంది!

Tue 07th Aug 2018 02:32 PM
ritu varma,goodachari,chance,adivi sesh,happy  'గూఢచారి'లో చేయనందుకు సంతోషపడుతోంది!
Ritu Varma Feeling about Goodachari Chance Miss 'గూఢచారి'లో చేయనందుకు సంతోషపడుతోంది!
Advertisement
Ads by CJ

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడివి శేష్ గూఢచారి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. హీరో గా అడివిశేష్ ఈ సినిమాకి కథ కూడా అందించాడు. గతంలో అడివిశేష్ కథ అందించి తాను హీరోగా నటించిన క్షణం సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుని.. కలెక్షన్స్ కొల్లగొట్టిందో.. ఇప్పుడు గూఢచారి సినిమా కూడా అలానే తక్కువ బడ్జెట్ తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. క్షణం సినిమా కేవలం కోటిన్నరతో తెరకెక్కితే... గూఢచారి సినిమాని 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక గూఢచారి సినిమాలో అడివిశేష్ నటనకు, శశికిరణ్  డైరెక్షన్ స్కిల్స్ కి, అలాగే సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇలా చాలా విషయాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

కానీ ఈ సినిమా.. హీరోయిన్ శోభిత దూళిపాళకి పెద్దగా పేరు తీసుకురాలేదు. కొత్త హీరోయిన్ గా హీరోయిన్ కి పెద్దగా స్కోప్ లేని పాత్రలో ఆమె నటించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం.. అలాగే ఆమె పాత్ర అసలు ఎక్సపోజ్ కాకపోవడంతో ఆమెకి ఎలాంటి పేరు రాలేదు. అయితే గూఢచారి హీరోయిన్ పాత్రకి శోభితని తీసుకునే ముందుగా పెళ్లి చూపులు హీరోయిన్ రీతూ వర్మని అడిగారట. కానీ రీతూ వర్మ నో చెప్పిందట. అప్పట్లో అడివిశేష్ నేను హీరోగా నచ్చక రీతూ వర్మ నో చెప్పిందని బయటికి చెప్పేశాడు.

అయితే రీతుకి ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర నచ్చక రిజెక్ట్ చెయ్యడం ఇప్పుడు హ్యాపీగా ఉందట. సినిమా హిట్ అయినా అందులో హీరోయిన్ కి ఎలాంటి పేరు రాలేదు కనుకనే రీతూ వర్మ ఇపుడు హ్యాపీగా ఫీల్ అవుతుందట. మరి సినిమా హిట్ అయ్యి హీరోయిన్కి పేరొస్తే గ్యారంటీగా బాధపడేది . ఇకపోతే రీతూవర్మ ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా, విక్రమ్ తో ధ్రువ నచ్చత్తిరమ్ సినిమాల్లో నటిస్తుంది. టాలీవుడ్ లో మాత్రం అమ్మడుకి ఛాన్సెస్ లేవు. 

Ritu Varma Feeling about Goodachari Chance Miss:

Ritu Varma Missed Goodachari, But She is Happy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ