ఏ నిర్మాతకు లేని క్రేజ్ దిల్ రాజుకి ఉంది. దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తే హిట్ ఖాయం అంటారు యువ హీరోలు. ఎక్కడో రాజ్ తరుణ్ లాంటి బ్యాడ్ లాక్ హీరోలు తప్ప.. యువ హీరోలందరి చూపు దిల్ రాజు బ్యానర్ మీదే ఉంటుంది. కానీ దిల్ రాజు మాత్రం ఏరి కోరి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తాడు. అలాగే డైరెక్టర్ చెప్పిన కథ నచ్చిందా అంటే.. అతన్ని తన కాంపౌండ్ దాటి బయటికి పోనియడనే టాక్ కూడా ఉంది. శతమానం భవతి అనే హిట్ కుటుంబ కథా చిత్రం చేసిన సతీష్ వేగేశ్నని మళ్లీ శ్రీనివాస కళ్యాణం సినిమాతో కట్టిపడేశాడు. సతీష్ వేగేశ్న వెంటవెంటనే సినిమాలను దిల్ రాజుకే చేశాడు.
అయితే శతమానం భవతి తో ఆఫర్ ఇచ్చి తనని డైరెక్టర్ చేసిన దిల్ రాజు అంటే సతీష్ కి గౌరవంతో కూడిన అభిమానం అయితే బాగానే వుంది. అందుకే దిల్ రాజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వేళ్ళు పెట్టినా ఊరుకునే స్థాయి అభిమానము అయితే ఉంటుందా? ఏమో అది సతీష్ కే తెలియాలి. ఇంతకీ విషయం ఏమిటంటే దిల్ రాజు ఇప్పుడు తెరవెనుక దర్శకుడిగా మారాడని టాక్ స్ప్రెడ్ అయ్యింది. తాను ఏ సినిమాని నిర్మించినా అన్ని తానై చూసుకునే తత్వమున్న దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం సినిమా డైరెక్షన్ లో వేలు పెట్టి దర్శకుడు సతీష్ వేగేశ్న ని ఇబ్బంది పెట్టాడనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ నోటా ఈ నోటా అవి దిల్ రాజు చెవికి చేరడం.. వెంటనే లైన్ లో కొచ్చిన దిల్ రాజు ఇలాంటి వార్తలు చూస్తే బాధేస్తుందని.. అలాగే ఈ వార్తలపై తానెంతో హర్ట్ అయ్యానని.. అసలు నేను దర్శకుడి వెనక మాత్రమే ఉంటాను. అయినా సినిమా సెట్ లో మేమంతా కలిసి మెలిసి పని చేసుకుంటాం. కథ విని సినిమా చెయ్యడం అనేది నిర్మాత బాధ్యత. అందుకే కథతో పాటుగా డైరెక్టర్ నేను సినిమా మొత్తం కలిసి ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణంలో నేనేం చేస్తానో.. దర్శకుడు ఏం చేస్తాడో నాకు మాత్రమే తెలుసు. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచిస్తే బావుంటుంది... దయచేసి ఇలాంటి రూమర్స్ పుట్టించొద్దు అంటూ తాను ఎంతగా హర్ట్ అయ్యాడో చెప్పాడు దిల్ రాజు.