Advertisementt

'రిషి'.. స్లో...గా ఎక్కుతుంది

Tue 07th Aug 2018 09:45 PM
rishi,mahesh babu,mahesh 25th film title,vamsi paidipally  'రిషి'.. స్లో...గా ఎక్కుతుంది
Mahesh Babu 25th Film Title Confirmed 'రిషి'.. స్లో...గా ఎక్కుతుంది
Advertisement
Ads by CJ

సాధారణంగా స్టార్‌ హీరోలు నటించే పవర్‌ఫుల్‌ చిత్రాలకు కథానుసారం పెట్టే టైటిల్స్‌ కంటే ఆయా చిత్రాలలో ఆ స్టార్స్‌ పేరునే టైటిల్‌గా పెట్టడం ఎప్పటినుంచో వస్తోంది. ఇలా పలు చిత్రాలలో స్టార్స్‌ పవర్‌ఫుల్‌ టైటిల్‌నే సినిమాలకు యాప్ట్‌గా భావిస్తూ ఉంటారు. దీంతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా కథానుసారం టైటిల్‌ని ఫిక్స్‌ చేసే తలలు బద్దలు కొట్టుకునే పని తప్పుతుంది. కానీ మహేష్‌ కెరీర్‌లో 'మురారి, వంశీ, అర్జున్‌, నాని, బాబి' వంటి కొన్ని చిత్రాలు తప్ప 'రాజకుమారుడు, యువరాజు, బిజినెస్‌మేన్‌. పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, స్పైడర్‌, భరత్‌ అనేనేను' వంటి కథానుసారం సాగే టైటిల్స్‌ కూడా బాగానే ఉన్నాయి. 

ఇక మహేష్‌బాబు నటించే 25వ ప్రతిష్టాత్మక చిత్రానికి రోజుకో లెటర్‌ విడుదల చేస్తున్న వాటిని బట్టి ఈ మూవీ టైటిల్‌ 'రిషి' అని అర్ధమవుతోంది. ఇది పెద్దగా వెంటనే కిక్‌ ఇచ్చే పవర్‌ఫుల్‌ టైటిల్‌ కానప్పటికీ మెల్లగా ప్రేక్షకుల మదిలో నాటే టైటిలే అని ఒప్పుకోవాలి. దీనిని బట్టి ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్‌ పేరు 'రిషి' అని పలువురు కన్‌ఫర్మ్‌ చేస్తున్నారు. మరీ పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెడితే ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్‌ చేయలేకపోవచ్చు. 

'రిషి' అనే టైటిల్‌ చాలా సాఫ్ట్‌గా ఉందని, తమ హీరో 25వ ప్రతిష్టాత్మక చిత్రానికి ఇంత సింపుల్‌ టైటిల్‌ ఏమిటని ఆయన అభిమానులు అసంతృప్తి చెందినా ఇదే టైటిల్‌ అయితే స్లోపాయిజన్‌లా ఎక్కుతుందని చెప్పవచ్చు. మరి మహేష్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసే ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ విషయంలో యూనిట్‌ ఇదే టైటిల్‌ని ఫిక్స్‌ చేస్తుందా? లేక అభిమానుల అసంతృప్తిని తెలుసుకుని మరో టైటిల్‌ని ప్రకటిస్తారా? అనేది వేచిచూడాల్సివుంది....!

Mahesh Babu 25th Film Title Confirmed:

>Fans Not Happy with Rishi Title?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ