Advertisementt

కరుణ ఉత్తమ నేత: బాలయ్య, మోహన్ బాబు

Wed 08th Aug 2018 04:10 PM
kalaignar,balakrishna,karunanidhi,pay tribute,mohan babu  కరుణ ఉత్తమ నేత: బాలయ్య, మోహన్ బాబు
Tamil Nadu Former CM Karunanidhi No More కరుణ ఉత్తమ నేత: బాలయ్య, మోహన్ బాబు
Advertisement
Ads by CJ

అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయాం- నందమూరి బాలకృష్ణ

రాజకీయ నాయకులు కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిది, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

 

రాజకీయ భీష్మపితామహుడ్ని కోల్పోయాం - డా.ఎం.మోహన్ బాబు 

దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన 'నీడ, బంగారక్క' చిత్రాలకు గాను స్వర్గీయ కరుణానిధి గారి నుంచి అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేను. ఆయన ఉత్తమ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు అద్భుతమైన రచయిత, వక్త. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయి. ఆయన కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆయన మరణించారంటేనే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి ఆ శిరిడి సాయినాధుని ఆశీస్సులతో మనోధైర్యం సిద్ధించాలని కోరుకొంటున్నాను.

Tamil Nadu Former CM Karunanidhi No More:

Balakrishna and Mohan Babu Pay Tribute to Kalaignar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ