Advertisementt

చ‌రిత్ర భ‌విష్య‌త్‌ని వెంటాడుతుందట..!

Wed 08th Aug 2018 04:28 PM
suvarna sundari,jayapradha,poorna,september  చ‌రిత్ర భ‌విష్య‌త్‌ని వెంటాడుతుందట..!
Suvarna Sundari Latest Update చ‌రిత్ర భ‌విష్య‌త్‌ని వెంటాడుతుందట..!
Advertisement
Ads by CJ

విడుదలకు సిద్ధమవుతున్న విజువల్ వండర్ 'సువర్ణసుందరి'

టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ సినిమా విశేషమైన ఆదరణ చూరగొంటోంది. ఆ నేపధ్యంలో అద్భుతమైన కంటెంట్, అమేజింగ్ గ్రాఫిక్స్ తో ఎపిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం 'సువర్ణసుందరి'. పునర్జన్మల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలకపాత్ర పోషిస్తుండగా.. ఆమెకు తల్లిగా పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి విశేషమైన స్పందన లభించగా.. ఆగస్ట్ లో ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

'బాహుబలి, భజరంగీ భాయిజాన్' చిత్రాలకి వర్క్ చేసిన వి.ఎఫ్.ఎక్స్ టీం 'సువర్ణసుందరి' చిత్రానికి కూడా వర్క్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకొంది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు మా టీం అందరం కృషి చేస్తున్నాం అన్నారు దర్శకనిర్మాతలు. 

సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ కృష్ణ దేవ‌రాయ‌ల స్టోరీ ఆధారంగా తెర‌కెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. చ‌రిత్ర భ‌విష్య‌త్‌ని వెంటాడుతోంది అనే ట్యాగ్ లైన్‌తో విజువ‌ల్ ఫీస్ట్‌గా మూవీ రూపొందుతుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్, అవినాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎల్లు మహంతి, సంగీతం: సాయి కార్తీక్‌, దర్శకత్వం: ఎం.ఎస్.ఎన్. సూర్య.

Suvarna Sundari Latest Update:

Suvarna Sundari Release on September

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ