దిల్ రాజు నిర్మాతగా 'శతమానంభవతి' సినిమా డైరెక్టర్ సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నితిన్.. రాశి ఖన్నా జంటగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ జనాల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అయిన 'శతమానంభవతి' చిత్రానికి ఈ సినిమా ఏ మాత్రం తీసిపోదని సినీ పండితులు నమ్ముతున్నారు.
ఈ సినిమాలో పెళ్లి గురించి చెప్పే డైలాగ్స్ కానీ.. ఫ్యామిలీ విలువలు గురించే చెప్పే మాటలు కానీ.. సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. ఇక సినిమా స్టోరీ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. హీరో హీరోయిన్ ఇద్దరు బాగా డబ్బున్న ఫ్యామిలీస్ కి చెందినవారు. ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి ఈ ఇద్దరికీ పెళ్లి చేయాలనీ నిర్ణయించుకుంటారు.
కానీ హీరోహీరోయిన్ లకు పెళ్లి చేసుకోవడం ఇష్టముండదు. పెద్దవాళ్లు చేస్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకుని తర్వాత విడిపోదాం అని పెళ్లి రెడీ అవుతారు. ఈ విషయం గురించి తెలిసిన పెద్దలు వారి పెళ్లిపై ఉన్న అపనమ్మకం పోగొట్టి.. వారిద్దరూ జీవితాంతం కలిసి ఉండేలా..నిర్ణయించుకునేలా వారి పెళ్లిని నిర్వహిస్తారు. ఈ స్టోరీ లైన్ తో డైరెక్టర్ సతీష్ తనదైన శైలితో ఫ్యామిలీ టచ్ ఇచ్చి సినిమాను రూపొందించాడని సమాచారం. ఇక క్లైమాక్స్ లో నితిన్ చెప్పే డైలాగ్స్ సినిమాకు హైలైట్ అని చెబుతున్నారు.