Advertisementt

మళ్లీ లీక్: 'అరవింద సమేత' ఇలా అయితే కష్టమే!

Fri 10th Aug 2018 09:09 PM
aravinda sametha,jr ntr,trivikram srinivas,leaked pics,teaser cutting pics  మళ్లీ లీక్: 'అరవింద సమేత' ఇలా అయితే కష్టమే!
Aravinda Sametha Teaser Cutting Pics Leaked మళ్లీ లీక్: 'అరవింద సమేత' ఇలా అయితే కష్టమే!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత చిత్రం 'జై లవ కుశ' టైం లో 'జై లవ కుశ' టీజర్  విడుదలకు ముందే ఆ టీజర్ లోని కొన్ని సన్నివేశాలు యూట్యూబ్ లో హల్చల్ చేశాయి. అలాగే ఆ టీజర్లోని జై పాత్రధారి ఎన్టీఆర్ పిక్స్ లీకవడమే కాదు క్షణాల్లో అవి మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు జై లవ కుశ నిర్మాత కళ్యాణ్ రామ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు లీకుల రాయుళ్లను పట్టుకోవడానికని. ఇప్పుడు ఎన్టీఆర్ 'అరవింద సమేత - వీర రాఘవ' సినిమాని కూడా ఈ లీకులు.. దడ పుట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న అరవింద సమేతలోని ఎన్టీఆర్ అండ్ నాగబాబు కలిసి నటించిన సన్నివేశాలలో ఒక పిక్ లీకై పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. ఇక అప్పటినుండి అరవింద సమేత టీమ్ లో ఎవరు ఫోన్ లు కానీ... ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు కూడా అనుమతించొద్దని త్రివిక్రమ్ చెప్పినప్పటికీ.. మరో పిక్ లీకవడంతో యూనిట్ షాకయ్యింది.

ఆ లీకులను ఎలా ఆపాలో అనే విషయమై తర్జన భర్జన పడుతూనే... నిన్న ఆగష్టు 9 న అరవింద సమేత - వీర రాఘవ సినిమా టీజర్ ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించగానే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మరి ఫ్యాన్స్ ఇంకా అరవింద సమేత టీజర్ రాక కోసం సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేసిన టైం లోనే  ఇలా.. అరవింద సమేత లీక్డ్ టీజర్ బైటికొచ్చేసింది.అరవింద టీజర్ లోని కొన్ని పిక్స్ ఇపుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో వీర విహారం చేస్తున్నాయి. ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లీకులు అరవింద సమేత టీమ్ కి ఒణుకు పుట్టిస్తున్నాయి. 

మరి లీకైన అరవింద టీజర్ పిక్స్ లో ఎన్టీఆర్ ఉగ్రరూపంతో పాటుగా.. నాగబాబు ఉన్న ఫొటోస్ కనబడుతున్నాయి. అంటే... ఈ సినిమా లో ఎన్టీఆర్ - నాగబాబుకు సంబంధించిన కొన్ని సీన్స్ కనబడుతున్నాయి. అరవింద టీజర్ ని తండ్రీకొడుకుల సెంటిమెంట్ మీదే ఎక్కువగా కట్ చేశారనిపిస్తుంది. మరి ఈరకంగా సినిమాలోవి అన్ని లీకవుతుంటే... సినిమా మీద ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. అయినా అరవింద సమేతలోని లీకైన టీజర్ పిక్స్ ఒరిజినల్ వా... లేదంటే ఇంటర్నెట్ మాయాజాలమా అనేది మాత్రం అరవింద సమేత ఒరిజినల్ టీజర్ బయటికొచ్చాక గాని క్లారిటీ రాదు.

Aravinda Sametha Teaser Cutting Pics Leaked:

Aravinda Sametha in leaked Troubles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ