ప్రస్తుతం కాస్టింగ్‌కౌచ్‌తో నటి శ్రీరెడ్డి బాగా పాపులర్ అయింది. అయితే ఇలాంటి వారికి గురువుగా భావించదగ్గ యువతి తారాచౌదరి. పెద్ద పెద్ద సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు అమ్మాయిలను పంపిస్తూ, సినీ రంగంపై మోజు ఉండి నటీమణులుగా మారాలని భావించే యువతలను వ్యభిచార వృత్తిలోకి దించిన మనిషి ఆమె. కానీ ఈమె వెనుక చాలా పెద్ద తలలు ఉండటంతో ఈ కేసు ఆమెని ఏమీ చేయలేకపోయింది. ఇక ఈమె జీవితం ఆధారంగా ముద్దు ఆర్ట్స్ అధినేత, స్వర్గీయ జయకృష్ణ ఓ చిత్రం తీయాలని భావించాడు. 'తారామణి' (చంద్రులు ఎందరో) అనే పేరుతో ఆమె జీవితాన్ని ఆయన సినిమాగా తీయాలని భావించినా అది వీలుకాలేదు.
కాగా ఇంత కాలానికి తారాచౌదరి మరోమారు మీడియా ముందుకు వచ్చింది. గతంలో ఆమె వివాదంలో హీరో రాజశేఖర్ పేరు కూడా బయటకు వచ్చింది. ఇక తాజాగా తారాచౌదరి మాట్లాడుతూ, నాకు, డాక్టర్ రాజశేఖర్‌కి ఏదో ఉంది? అనే విషయంలో ఏమాత్రం నిజంలేదు. రాజశేఖర్ అంటే నటునిగా నాకెంతో ఇష్టం. ఆయన నటించిన 'మా అన్నయ్య' చిత్రం నాకెంతో నచ్చింది. హైదరాబాద్‌లో ఓసారి షూటింగ్‌లో ఆయన్ను కలిశాను. ఆ సినిమా ఎంతో బాగుందని చెప్పాను. దానికి ఆయన సంతోషించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నేను నివసించే ఫ్లాట్ పక్కనే మరోటి ఖాళీగా ఉండటంతో రాజశేఖర్, జీవితలు దానిని చూడటానికి వచ్చారు. అలా వారితో నాకు ముఖ పరిచయం ఏర్పడింది. అంతే తప్ప తమ మధ్య ఏదో ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజశేఖర్ చాలా మంచి వ్యక్తి. బయటి వారు ఏదేదో అనుకుంటూ ఉంటారు. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు... అని చెప్పుకొచ్చింది.
అయినా ఇటీవల శ్రీరెడ్డి వ్యవహారంలో కూడా జీవిత, రాజశేఖర్ మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఇలా ప్రతి వివాదంలోనూ ఈ జంట పేరు బయటికి రావడం చూస్తుంటే ఏదో ఉందనే అనుమానాలు రాకుండా ఉండదు. ఎందుకంటే ఒకసారి వారి గురించి చెడుగా వస్తే ఏదో పొరపాటు అని అనుకోవచ్చు. కానీ పదే పదే వారి మీద ఇలాంటి వివాదాలు రావడం, వాటిని వారు సమర్ధించుకుంటూ ఉండటం చూస్తే నిప్పు లేనిదే పొగరాదని అర్ధమవుతోంది.