యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' అక్టోబర్ 11న విజయదశమి కానుకగా విడుదల కానుంది. దాదాపు ఇదే చిత్రం ప్రారంభమైన సమయంలోనే షూటింగ్‌లను ప్రారంభించుకున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు 25వ ప్రతిష్టాత్మక చిత్రం ఏ చిత్రానికి అడ్డు రాకుండా వచ్చే ఏడాది ఏప్రిల్‌కి రానుంది. మరోవైపు రామ్‌చరణ్, బోయపాటి శ్రీను చిత్రం సంక్రాంతిని ఫిక్స్ చేసుకుంది. ఇలా తమ చిత్రాలు ఒకదానితో మరోటి పోటీపడకుండా ఈ ముగ్గురు స్టార్స్ ముందుకు వెళ్తున్నారు.
ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లో రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం మహేష్, రామ్‌చరణ్ చిత్రాల కంటే ముందుగా వస్తున్నా కూడా ప్రమోషన్ల విషయంలో, అభిమానుల్లో భారీ అంచనాలు పెంచడంలో మాత్రం మహేష్ టీమే ముందడుగులో ఉంది. ఆల్‌రెడీ 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలోని ఎన్టీఆర్ చొక్కా విప్పి సిక్స్‌ప్యాక్‌తో చేతిలో కొడవలి వంటి ఆయుధాన్ని పట్టుకుని రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ తరహాలో ఇచ్చిన లుక్, ఎన్టీఆర్, హీరోయిన్ పూజాహెగ్డేలను చూపిస్తూ విడుదలైన మోషన్ పోస్టర్‌లు ముందుగానే విడుదలయ్యాయి. ఇలా చూసుకుంటే ఈ చిత్రం మొదటి టీజర్‌ని కూడా మహేష్ 'మహర్షి' కంటే ముందే కనీసం పది పదిహేను రోజుల గ్యాప్ ఉండేలా ప్రకటించి ఉంటే అభిమానులు ఖుషీ అయి సోషల్ మీడియాలో దానిని ట్రెండింగ్‌లో ఉంచేవారు.
కానీ మహేష్ టీజర్ సమయంలోనే ఎన్టీఆర్ టీజర్‌ని కూడా ప్రకటించి ఉంటే అభిమానుల మధ్య చిన్నపాటి యుద్దమే జరిగేది. అందుకే ఎన్టీఆర్ అండ్ టీం మహేష్ బర్త్‌డే హంగామా ముగిసిన తర్వాత, 'మహర్షి' మొదటి టీజర్ విడుదలైన తర్వాత తాపీగా ఆగష్టు15న టీజర్ రానుందని ప్రకటించారు. ఈ విధంగా చూసుకుంటే మన యంగ్ స్టార్స్ సినిమాల విషయంలోనే కాదు.. ఫస్ట్‌లుక్, టీజర్ల విషయంలో కూడా గ్యాప్ మెయిన్‌టెయిన్ చేయడం హర్షణీయం. దీనిని బట్టి ఎన్టీఆర్‌కి, మహేష్‌కి ఉన్న బాండింగ్ అర్ధమవుతోంది.