Advertisementt

ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే మోస్ట్ ఫ‌న్ అవార్డ్స్ ఇవే!

Tue 14th Aug 2018 09:48 PM
siima awards,siima short film awards,siima,7th edition curtain raiser,short film awards  ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే మోస్ట్ ఫ‌న్ అవార్డ్స్ ఇవే!
Siima 7th Edition Curtain Raiser and Short Film Awards Event ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే మోస్ట్ ఫ‌న్ అవార్డ్స్ ఇవే!
Advertisement
Ads by CJ

2018 సౌత్ ఇండియ‌న్ ఇంటర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ క‌ర్టెన్ రైజ‌ర్ మ‌రియు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ హైద‌రాబాద్ లోని వెస్ట‌న్ హోట‌ల్లో ఘ‌నంగా జ‌రిగింది. రానా ద‌గ్గుపాటి, ప్ర‌ణీత సుభాష్, ప్రగ్యా జైస్వాల్, శాన్వి శ్రీ‌వాస్త‌వ్, సుభ్రా అయ్య‌ప్ప‌, సైమా ఛైర్ ప‌ర్స‌న్ బృందా ప్ర‌సాద్ అడుసుమిల్లి, గౌర‌వ్ చ‌క్ర‌వ‌ర్తి (హెడ్, మార్కెటింగ్, పాంటాలూన్స్) ఈ వేడుక‌కు ముఖ్య అతిథులుగా వ‌చ్చారు. 

సైమా ఛైర్ ప‌ర్స‌న్ బృందాప్ర‌సాద్ అడుసుమిల్లి మాట్లాడుతూ.. ఈ వేడుక జరిపించ‌డం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌తీసారి ఇలాంటి వేడుక చేయ‌డం.. అంద‌ర్నీ ఒకే చోట చేర్చ‌డం గ్రేట్ ఫీలింగ్ అన్నారు. 

హీరోయిన్ ప్ర‌ణీత మాట్లాడుతూ.. ముందుగా సైమాను ఇంత గ్రాండ్ గా ఏర్పాటు చేసినందుకు విష్ణు ఇందూరి మ‌రియు బృందా ప్ర‌సాద్ అడుసుమిల్లి గారికి కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌తీసారి ఇలాంటి వేడుక‌లో చాలా మంది న‌టీన‌టులు క‌లుస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి ఈ వేడుక‌లో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. ఈసారి కూడా అదే జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు.  

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. ఇక్క‌డ ఇలా సైమా క‌ర్టెన్ రైజ‌ర్ లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. నా కెరీర్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి సైమాతో జ‌ర్నీ చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో తొలి అవార్డ్ అందుకున్న‌ది ఇక్క‌డే.. పాల్గొన్న అవార్డ్ వేడుక ఇదే.. స్టేజ్ పై ప‌ర్ఫార్మ్ చేసిన వేదిక కూడా సైమానే. అందుకే సైమాతో నా ప్ర‌యాణం చాలా ప్ర‌త్యేకం. ఇన్నేళ్ల నుంచి సైమా అవార్డు వేడుక‌లు నిర్వ‌హిస్తున్న విష్ణు గారు, బృందాగారికి కృత‌జ్ఞ‌త‌లు. ఈ రోజు కూడా చాలా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే మోస్ట్ ఫ‌న్ అవార్డ్స్ ఇవే అవుతాయని అనిపిస్తుంది.. అన్నారు. 

శాన్వి మాట్లాడుతూ.. సైమా ద‌క్షిణాది ఇండ‌స్ట్రీని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో ఓ భాగం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను గెలుచుకున్న ఏకైక అవార్డ్ సైమా వాళ్లు ఇచ్చిందే.. నా జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకుంటాను అని తెలిపారు. 

సుబ్ర అయ్య‌ప్ప మాట్లాడుతూ.. సైమా నాకు ఎప్పుడూ ఫేవ‌రేట్ అవార్డ్ ఫంక్ష‌న్. ఇది ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. ఇది చాలా ప్ర‌త్యేకం మ‌రియు దీని వెన‌క ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు ఈ బ్రాండ్ సృష్టించారు. షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వ‌డం కూడా కొత్త‌గా అనిపిస్తుంది. ఎంతోమంది కొత్త ద‌ర్శ‌కుల‌కు వాళ్ల టాలెంట్ చూపించ‌డానికి ఇదో గ్రేట్ ప్లాట్ ఫాంలా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. 2018 సైమా ఇంకా భారీగా ఉంటుంద‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు. 

పాంటాలూన్స్ మార్కెటింగ్ హెడ్ శ్రీ గౌర‌వ్ చ‌క్ర‌వ‌ర్తి గారు మాట్లాడుతూ.. సైమా సెవెన్త్ ఎడిష‌న్ లో పాంటాలూన్స్ పార్ట్ న‌ర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. కొన్నేళ్లుగా సైమా చాలా ప్ర‌తిష్మాత్మ‌కంగా మారుతుంది. సౌత్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలోని టాలెంట్ ను గుర్తించ‌డానికి గ్రేట్ ప్లాట్ ఫామ్ లా ఇది మారుతున్నందుకు సంతోషంగా ఉంది. పాంటాలూన్స్ 132 ప‌ట్ట‌ణాలు.. 284 న‌గ‌రాల్లో స్టోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇవ‌న్నీ సైమాకు మ‌రింత అదన‌పు హంగులు అద్దుతాయ‌ని ఆశిస్తున్నాం. ఈ వేడుక‌లో త‌మ ఫ్యాష‌న్ డిజైనింగ్ క్యాస్ట్యూమ్స్ అన్నీ సెలెబ్రెటీస్ కు అద్భుతంగా ఉంటాయ‌ని ఆశిస్తున్నాం. ఈ క‌ల‌యిక‌తో త‌మ పాంటాలూన్స్ మ‌రో స్థాయికి చేరుతుంద‌ని.. సినిమా న‌టుల ఛ‌రిష్మా త‌మ‌కు కూడా యూజ్ అవుతుంద‌ని చెప్పారు. 

ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ.. ఈ వేడుక‌కు న‌న్ను ఆహ్వానించినందుకు ముందు ధ‌న్య‌వాదాలు. షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ గెలుచుకున్న వాళ్లంద‌రికీ కంగ్రాట్స్. నేను కూడా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ నుంచే వ‌చ్చాను.. ఈ అవార్డ్స్ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ కు చాలా కాన్ఫిడెన్స్ ను ఇస్తాయి. ఇండ‌స్ట్రీకి రావ‌డానికి ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. యాదృశ్చికంగా మొన్న నేను చేసిన ఈ న‌గ‌రానికి ఏమైంది కూడా షార్ట్ ఫిల్మ్ నేప‌థ్యంలోనే ఉంటుంది. నా స‌పోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది. దీనికోసం సైమాకు మ‌రోసారి కృత‌జ్ఞ‌త‌లు అని తెలిపారు. 

హీరో రానా ద‌గ్గుపాటి మాట్లాడుతూ.. ఇది సెవెన్త్ ఎడిష‌న్ ఆఫ్ సైమా. కాలం చాలా వేగంగా వెళ్లిపోతున్న‌ట్లు అనిపిస్తుంది. విష్ణు మ‌రియు బృందాకు కంగ్రాట్స్. మీరు ఓ బ్రాండ్ ను సృష్టించారు.. అందులో మొద‌ట్నుంచి న‌న్ను కూడా భాగం చేసారు. సైమా అవార్డ్స్ వేడుక‌తోనే నేను హోస్ట్ గా అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యాను. ఇప్ప‌టికే చాలా సార్లు ఈ వేడుక‌కు హోస్ట్ గా చేసాను కూడా. షార్ట్ ఫిల్మ్ మేక‌ర్స్ అంద‌రికీ ఒక్క‌టే చెబుతున్నాను.. కొత్త క‌థ‌లు, న్యూ మేకింగ్ తో అంద‌రూ ఆక‌ట్టుకోవాల‌ని ఆశిస్తున్నాను. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.. సైమాను క‌లిసి చేస్తున్నందుకు మ‌రోసారి అంద‌రికీ కంగ్రాట్స్ చెబుతున్నాను అంటూ ముగించారు.

Siima 7th Edition Curtain Raiser and Short Film Awards Event:

>Siima 7th Edition Curtain Raiser and Short Film Awards Event Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ