తెలుగు తెరపై నటిగా, టివి ప్రోగ్రామ్స్ హోస్ట్‌గా, ప్రజెంటర్‌గా స్వాతిరెడ్డికి మంచి పేరుంది. ఈమె నాటి సోవియట్ రష్యాలో జన్మించింది. ఈమె పేరు కూడా పలకడానికి ఎంతో క్లిష్టమైన స్వెట్లానా. ఈమె తండ్రి సోవియట్ యూనియన్‌లో నావీలో సబ్‌మెరైనర్‌గా పని చేసేవాడు. ఈయన ఇండియన్ నేవీ తరపున రష్యాలో పనిచేసేవాడు. తర్వాత ఈమె తన పేరును స్వాతిరెడ్డిగా మార్చుకుంది. ఈమె తల్లిదండ్రుల పేర్లు ఇందిరాదేవి, శివరామకృష్ణారెడ్డి. ఈమె చదువు వైజాగ్‌లో జరిగింది. ఇక మాటీవీలో 1996లో ప్రసారమైన కలర్స్ ద్వారా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి కలర్స్ స్వాతిగా మారింది. ఈమె ప్లేబ్యాక్ సింగర్ కూడా. ఇక తెలుగులో కంటే ముందు తమిళ, మలయాళ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. ఈమె పలువురు హీరోయిన్లకి డబ్బింగ్ కూడా చెప్పింది.
తమిళంలో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’, తెలుగులో ‘డేంజర్, అష్టాచెమ్మా, స్వామి రా..రా, కార్తికేయ, గీతాంజలి2’ వంటి పలు చిత్రాలలో నటించింది. మలయాళంలో ఆమె నటించిన ‘ఆమెన్’ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ అల్లరి చిల్లరిగా కనిపించే ఈమె నిఖిల్‌తో ప్రేమాయణం నడుపుతోందని పలు వార్తలు వచ్చాయి. అంతేకాదు. ఆమె ఏ చిత్రంలో ఏ హీరోతో కలిసి నటిస్తే ఆ హీరోతో ఆమెకి ఎఫైర్లు అంటగట్టేవారు. దానిపై ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేసింది.
ఇక విషయానికి వస్తే స్వాతిరెడ్డి కెరీర్ ప్రస్తుతం ఏమీ ఆశాజనకంగా లేదు. దాంతో ఆమె త్వరలో వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. నటనకు అవకాశం వుండే పాత్రలు చేస్తూ, స్వాతిరెడ్డి నటిస్తోంది అంటే సమ్‌థింగ్ ఏదో డిఫరెంట్‌గా ఉంటుందనే మంచి పేరును సాధించుకున్న తెలుగమ్మాయిలలో ఈమె ఒకరు. పెద్దల అంగీకారంతోనే ఆమె ఈనెల 30వ తేదీన వివాహం చేసుకోనుందని సమాచారం. ఈమె వికాస్ అనే యువకుడితో ఎంతో కాలంగా స్నేహంతో పాటు ప్రేమలో కూడా ఉందని తెలుస్తోంది. వికాస్ కేరళకి చెందిన యువకుడని, ఆయన మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో పైలెట్‌గా పనిచేస్తాడని సమాచారం. వివాహం హైదరాబాద్‌లో, రిసెప్షన్ కేరళలో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి.