డిసెంబర్ 21న వరుణ్ తేజ్ అంతరిక్షం 9000 KMPH.
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తొలి తెలుగు స్పేస్ థ్రిల్లర్ టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రానికి అంతరిక్షం 9000 KMPH టైటిల్ ఖరారు చేశారు. ఇందులో వరుణ్ తేజ్ వ్యోమగామిగా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. హాలీవుడ్‌లోనే ఎక్కువగా వచ్చే స్పేస్ కాన్సెప్టులను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈయన గతేడాది ఘాజీ సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్నాడు. మరోసారి కొత్తగా ప్రయత్నిస్తూ.. అంతరిక్షం 9000 KMPH సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
హాలీవుడ్ సినిమా గ్రావిటీ తరహాలోనే.. అంతరిక్షం 9000 KMPH సినిమాను కూడా జీరో గ్రావిటీ సెట్స్‌లో చిత్రీకరించాడు దర్శకుడు. దీనికోసం హీరో వరుణ్ తేజ్ కూడా కజకిస్థాన్ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని వచ్చారు. ఈ చిత్రం కోసం హాలీవుడ్ నుంచి ఓ టీంను తీసుకొచ్చాడు దర్శకుడు సంకల్ప్. వాళ్ల ఆధ్వర్యంలోనే అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారు. అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌తో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న అంతరిక్షం 9000 KMPH విడుదల కానుంది.
నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సంకల్ప్ రెడ్డి
సమర్పకులు: క‌్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: క‌్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్
సినిమాటోగ్రఫర్: జ‌్ఞానశేఖర్ విఎస్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
సంగీతం: ప‌్రశాంత్ విహారి
ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ మరియు మోనిక
యాక్షన్ కొరియోగ్రఫర్: టాడర్ పెట్రోవ్ లాజారోవ్
సిజీ: రాజీవ్ రాజశేఖరన్
పిఆర్ఓ: వంశీ శేఖర్