త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న అరవింద సమేత టీజర్ ఈ రోజు బుధవారం ఉదయం విడుదలయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ హీరోగా అదరగొడుతున్నాడు. త్రివిక్రమ్ కామెడీని వదిలేశాడో... లేదంటే టీజర్‌లో కామెడీని తప్పించాడో తెలియదు గాని.. త్రివిక్రమ్ మార్క్ కాకుండా ఎన్టీఆర్ మార్క్ అరవింద సమేత టీజర్ కనబడుతుంది. మాటల మాంత్రికుడు కామెడీ సమేత డైలాగ్స్ కాకుండా ఎన్టీఆర్ సమేత మాస్ డైలాగ్స్‌తో కట్ చేసిన అరవింద సమేత టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేస్తోంది.
బ్యాగ్రౌండ్‌లో జగపతిబాబు చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్.. మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా..అంటూ చెబుతుంటే.. ఎన్టీఆర్ నిజంగానే యంగ్ టైగర్ మాదిరిగానే విలన్స్ ని ఉతికి ఆరేస్తూ.. కత్తితో కస కస కోసేస్తూ.. రౌడీలను వేటాడుతుంటే.. నిజంగానే మచ్చల పులి.. లేడి పిల్లలను వేటాడినట్టుగా వుంది. అలాగే ఎన్టీఆర్ చెప్పిన రాయలసీమ పవర్ ఫుల్ యాస డైలాగ్ కంటపడ్డవా కనికరిస్తానేమో… వెంటపడ్డానా నరికేస్తాఓబా కేక పుట్టించేలా ఉంది. ఇక ఇంత పవర్ ఫుల్ టీజర్ ని యూట్యూబ్‌లో వదిలింది మొదలు ఎన్టీఆర్ ఫాన్స్ షేర్స్, లైక్స్ తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
మరి ఈ అరవింద సమేత టీజర్ విడుదలైన మూడు గంటల్లోపే.. 30లక్షల డిజిటల్ వ్యూస్ ను రాబట్టి యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మరి ఇదే రేంజ్ లో ఈ టీజర్ యూట్యూబ్‌లో చెలరేగిపోతే... ఒక 24 గంటల్లోపే కోటి వ్యూస్ ను సొంతం చేసుకోవడం పెద్ద కష్టమైన పనికాదు. మరి ఈ టీజర్లో అరవింద అదేనండి.. పూజ హెగ్డే కానీ.. ఏ ఇతర ఫ్యామిలీ ఆడియెన్‌కి కనెక్ట్ అయ్యే డైలాగ్ కానీ, సీన్ కానీ లేకపోయినా.. ఈ మాస్ టీజర్ కి ఈ రేంజ్ క్రేజ్ రావడం మాములు విషయం కాదు. ఎన్టీఆర్ స్టామినా.. త్రివిక్రమ్ కున్న క్రేజ్ ఈ అరవింద సమేతపై ఈ హైప్ రావడానికి కారణమని చెప్పొచ్చు.