Advertisementt

'సైరా'లో ఈ భామకి ఎవరు ఛాన్సిచ్చారు?

Sat 18th Aug 2018 11:38 AM
poonam kaur,chiranjeevi,sye raa narasimha reddy  'సైరా'లో ఈ భామకి ఎవరు ఛాన్సిచ్చారు?
Poonam Kaur in Sye Raa 'సైరా'లో ఈ భామకి ఎవరు ఛాన్సిచ్చారు?
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి చిత్రంలో అవకాశం వస్తే ఎంత నిడివి, పాత్ర ఏమిటి? పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి? అనేవి ఏ నటీనటులు పట్టించుకోరు. జస్ట్‌ చిరు చిత్రంలో క్షణకాలమైనా కనిపిస్తే చాలని ఇతర నటీనటులే కాదు.. స్వయంగా మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఆశపడుతూ ఉంటారు. ఆయన దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇస్తూ, తన 150వ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలని ఉందని పలువురు చెప్పారు. ఇప్పుడు ఆయన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా 'సై..రా...నరసింహారెడ్డి' రూపొందుతోంది. ఈ చిత్రంలో నటించడానికి ఏకంగా బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌, తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి, దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, తమన్నా, జగపతిబాబు వంటి వారు కీలకపాత్రలను పోషిస్తున్నారు. 

మరోవైపు మెగాడాటర్‌ కొణిదెల నిహారిక కూడా ఇందులో బోయ యువతి పాత్రను చేస్తోంది. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేసే ఉద్దేశ్యంతో ఆయా భాషా నటీనటులను పెట్టుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే హైదరాబాద్‌ అమ్మాయి పూనమ్‌కౌర్‌ అందరికీ తెలుసు. మోడల్‌గానే కాకుండా ఈమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, బాలీవుడ్‌ చిత్రాలలో కూడా నటించింది. ఎస్వీకృష్ణారెడ్డి 'మాయాజాలం', తేజ 'ఒక విచిత్రం' గోపీచంద్‌ 'శౌర్యం' వంటి పలు భాషల్లో నటించినా సరైన బ్రేక్‌ రాలేదు. ఇక ఈమె సినిమాలలో కంటే వివాదాలలోనే ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. అలాంటి పూనమ్‌కౌర్‌కి ఇప్పుడు మంచి అదృష్టం వరిచింది. 

ఈమె తాజాగా బాహుబలి నిర్మాతలు తీస్తున్న టివి సీరియల్‌ 'స్వర్ణఖడ్గం'లో నటిస్తోంది. ఇందులో ఆమె నటనను చూసి మెచ్చిన సురేందర్‌రెడ్డి పూనమ్‌ని 'సై...నరసింహారెడ్డి'లో ఓ పాత్రకి ఎంపిక చేశాడు. మరి ఈ చిత్రమైనా ఆమెకి మంచి గుర్తింపును తీసుకుని వస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Poonam Kaur in Sye Raa:

Pawan Recommends Poonam, What’s Up?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ