మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘తుఫాన్’ (జంజీర్) చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ‘ధృవ’ చిత్రంలో కూడా పోలీసు అధికారిగా కనిపించాడు. కానీ ఇది ఓ డిఫరెంట్ స్టోరీ, క్యారెక్టర్. ఇక ఇప్పుడు రామ్‌చరణ్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రను పోషిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం రామ్‌చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో స్నేహ, ప్రశాంత్, ఆర్యన్‌రాజేష్, వివేక్‌ఒబేరాయ్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ‘భరత్ అనే నేను’ బ్యూటీ కైరా అద్వానీ.. చరణ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ పోలీసు పాత్రను పోషిస్తున్నాడట.
బోయపాటి శ్రీను అంటే ఆయన కథలు సెంటిమెంట్‌తో ఉంటూనే ఎంతటి పవర్‌ఫుల్‌గా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో ఆయన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ని మరింత విభిన్నమైన పోలీస్‌గా చూపిస్తున్నాడని, పవర్‌ఫుల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ‘రంగస్థలం’ తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిల మల్టీస్టారర్ ముందు విడుదల కానుండటంతో అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఓ వైపు అన్నా వదినల సెంటిమెంట్‌ని చూపిస్తూనే చరణ్ పాత్రను బోయపాటి ఎంతో వెరైటీగా, పవర్‌ఫుల్‌గా చూపించనున్నాడట.
ఇంతవరకు చేయని పాత్ర కావడంతో చరణ్ కూడా ఈ పాత్ర పట్ల ఎంతో ఆసక్తిని చూపుతున్నాడని తెలుస్తోంది. బోయపాటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. అలాగే రామ్‌చరణ్ కూడా మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి సంక్రాంతి బరిలో బాలయ్య ‘ఎన్టీఆర్’కి పోటీగా దిగుతున్న ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో వేచిచూడాల్సివుంది.