Advertisementt

క‌థకు ప్రాణం పోసేది అదే: కోన వెంకట్

Mon 20th Aug 2018 12:22 PM
neevevaro,pre release event,vizag,kona venkat,taapsee,rithika singh,aadhi pinisetty  క‌థకు ప్రాణం పోసేది అదే: కోన వెంకట్
Neevevaro Movie Pre Release Event Details క‌థకు ప్రాణం పోసేది అదే: కోన వెంకట్
Advertisement
Ads by CJ

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 24న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. 

ఈ కార్య‌క్ర‌మంలో హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. కేర‌ళ ప్ర‌జ‌ల కోసం ప్రార్థ‌న‌లు చేయండి.. స‌హాయం చేయండి. ఇక ‘నీవెవ‌రో’ సినిమా విష‌యానికి వ‌స్తే.. ముందు వైజాగ్ గురించి మాట్లాడుకోవాలి.  వైజాగ్ వాతావ‌ర‌ణం చెన్నైకి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నా నెటివ్ ప్లేస్‌కు వ‌చ్చిన ఫీలింగ్ ఉంది. సినిమా వంద‌శాతం స‌క్సెస్ అవుతుంది.  మంచి క‌థ ఉంది. మంచి క‌థ‌తో పాటు మంచి నిర్మాత‌లు కోన వెంక‌ట్‌గారు, ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారు దొరికారు. కోన వెంక‌ట్‌గారు.. లేరంటే ఈ క‌థే లేదు. ఆయ‌న చెబితేనే ఈ క‌థ విన్నాను. న‌చ్చింది.. సినిమా కోన‌గారి వ‌ల్లే స్టార్ట్ అయ్యింది. తాప్సీ, రితికా ఇలా అంద‌రూ ఒక్కొక్క‌రుగా సినిమాకు యాడ్ అవుతూ వ‌చ్చారు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారు మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. ఇక సాంకేతిక నిపుణులు గురించి చెప్పాలంటే సినిమాకు సాయిశ్రీరామ్ కెమెరావ‌ర్క్ అందించారు. బ్యాక్‌బోన్‌లా స‌పోర్ట్ చేసి సినిమాకు అద్భుతమైన విజువ‌ల్స్ ఇచ్చారు. డైరెక్ట‌ర్ హ‌రినాథ్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. తాప్సీ అంద‌రికీ గుర్తుండిపోయే పాత్ర‌లో న‌టించింది. రితికా సింగ్‌.. గురు త‌ర్వాత తెలుగులో మంచి క‌థ కోసం వెయిట్ చేసి చేసిన పాత్ర ఇది. అలాగే శివాజీరాజాగారు, వెన్నెల‌కిశోర్‌, స‌ప్త‌గిరి ఇలా మంచి ఆర్టిస్టులు సినిమాకు ప‌నిచేశారు. ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.. అన్నారు. 

నిర్మాత కోన వెంక‌ట్ మాట్లాడుతూ.. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో..2003లో విడుద‌లైన ‘వెంకీ’ చిత్రం రైట‌ర్‌గా నాకొక స్థానాన్ని క‌ల్పించింది. ఆ రోజు నుండి నా సినిమాల్లో వైజాగ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. నాకు తెలియ‌కుండా.. నా స‌క్సెస్‌ల్లో వైజాగ్ కీల‌క‌పాత్ర పోషించింది. అలా వైజాగ్‌తో సెంటిమెంట‌ల్‌గా అనుబంధం ఏర్ప‌డింది. అంద‌రూ హీరోల‌తో ప‌నిచేశాను. 50 సినిమాల‌కు పైగా ర‌చ‌యిత‌గా ప‌నిచేశాను. ఎంత గొప్ప క‌థ రాసినా.. ఆ క‌థ‌ను తెర‌పై పండించేది న‌టీన‌టులే.. రంగ‌స్థ‌లంలో చిట్టిబాబు పాత్ర అయినా.. దూకుడులో మ‌హేశ్ పాత్ర అయినా బాద్‌షాలో ఎన్టీఆర్ పాత్ర అయినా.. ఇలా క‌థకు ప్రాణం పోసేది న‌టీన‌టుల న‌మ్మ‌క‌మే. అదే సినిమాకు ప్రాణం అవుతుంది. అలాగే నీవెవ‌రో సినిమాకు ప్రాణం పోసింది ఆది పినిశెట్టి. త‌ను  సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ క‌ష్ట‌మేంటో నాకు తెలుసు. నీవెవ‌రో సినిమా ఆది పినిశెట్టి కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీ అవుతుంది. నేను హీరోల‌కు ఫ‌స్ట్‌టైమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసిన సినిమాల‌న్నీ స‌క్సెస్ అయ్యాయి. అదే సెంటిమెంట్‌తో చెబుతున్నాను. ఆదికి ఈ సినిమాతో గొప్ప కెరీర్ దొరుకుతుంది. ఆది మ్యాడ్ యాక్ట‌ర్‌. క్యారెక్ట‌ర్‌ను ఓన్ చేసుకుంటే పిచ్చిగా ముందుకెళ్లిపోతాడు. గీతాంజ‌లితో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారితో మా ప‌రిచ‌యం మొద‌లైంది. సినిమా అంటే ప్రాణం ఆయ‌న‌కు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి కూడా వెళ‌తాన‌ని అన్నారు. ఆయ‌న‌లాంటి మంచి మ‌నిషి విశాఖ‌ప‌ట్నం రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. చాలా మేలు జ‌రుగుతుంది. ఈనెల 24న విడుద‌లవుతున్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంద‌ని గట్టి న‌మ్మ‌క‌ముంది.. అన్నారు. 

నిర్మాత ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ మాట్లాడుతూ.. కోన వెంక‌ట్‌గారు క‌థ చెప్ప‌గానే బాగా న‌చ్చింది.. వెంట‌నే ఆది పినిశెట్టిగారిని క‌లిశాం. తాప్సీ కూడా కథ చెప్పగానే సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించారు. తాప్సీ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయ్యారు. రితికా కూడా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో న‌టిస్తున్న మూవీ ఇది. ఈ నెల 24న విడుద‌ల‌వుతున్న నీవెవ‌రో చిత్రాన్ని ప్రేక్ష‌కులు పెద్ద హిట్‌చేస్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం.. అన్నారు. 

స‌ప్త‌గిరి మాట్లాడుతూ.. ల‌వ‌ర్స్‌ సినిమా డైరెక్ట్ చేసిన హ‌రినాథ్‌గారే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కోన‌గారు పిలిచి మరీ ఈ క్యారెక్ట‌ర్ చేయ‌మ‌ని అన్నారు. త‌ప్ప‌కుండా అంద‌రినీ నా పాత్ర‌తో ఎంట‌ర్‌టైన్ చేస్తాను. ఆది పినిశెట్టి.. వైశాలి. మృగం సినిమాల‌తో పాటు ఆయ‌న విల‌న్‌గా న‌టించిన చిత్రాలు కూడా చూశాం. ఈ మ‌ధ్య మ‌ర‌క‌త‌మ‌ణి సినిమా చూశాం. సినిమా సినిమాకు సంబంధం లేకుండా న‌టిస్తున్న గొప్ప న‌టుడు ఆది. ఆయ‌న ఈ సినిమాతో మ‌రో గొప్ప హీరోగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని ప్రామిస్ చేసి చెబుతున్నాను. ఆయ‌న‌తో పాటు ఈ సినిమాలో న‌టించినందుకు ఆనందంగా ఉంది. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారు.. చాలా స‌క్సెస్‌ఫుల్ వ్య‌క్తి.. ఆయ‌న రాజ‌కీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అక్క‌డ కూడా ఆయ‌న విజ‌యం సాధిస్తార‌ని కోరుకుంటున్నాను.. అన్నారు. 

వైజాగ్ మేయ‌ర్ మ‌ళ్లా విజ‌య‌ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ‌గారు .. ఓ బ్రాండ్‌గా ఎదిగారు. క‌ళ‌ల‌పై ఉన్న మ‌మ‌కారంతో.. కోన వెంక‌ట్‌గారితో క‌లిసి ఎం.వి.వి.సినిమాస్ బ్యాన‌ర్ పెట్టారు. మంచి టైటిల్‌తో సినిమా చేశారు. అంద‌రినీ ఆలోచింప చేసే టైటిల్ ఇది. టీజ‌ర్‌లో ఆది పినిశెట్టిగారి న‌ట‌న‌లో ఈజ్ ఉంది. ఈ సినిమా 50 రోజుల వేడుక‌ను ఇదే గుర‌జాడ క‌ళాక్షేత్రంలో.. వంద రోజుల వేడుక‌ను హైద‌రాబాద్‌లో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను.. అన్నారు. 

స‌త్యానంద్‌, వంశీకృష్ణ‌, కోలా గురు, కె.కె.రాజు, రామ‌కృష్ణ‌, బి.వెంక‌ట‌ర‌మ‌ణ‌, గోవింద్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Neevevaro Movie Pre Release Event Details:

Neevevaro Movie Pre Release Event highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ