ఇప్పుడు టాప్ హీరోయిన్స్ సైతం అవకాశమొచ్చి... అదరగొట్టే పారితోషకం ఇస్తుంటే.. ఐటమ్స్ సాంగ్స్ చెయ్యడానికి కూడా వెనుకాడడం లేదు. కాజల్ ఎన్టీఆర్ కోసం జనతా గ్యారేజ్ లో నేను పక్కా లోకల్ అంటూ రెచ్చిపోయింది. ఇక తమన్నా అయితే భారీ పారితోషకం ఇస్తే... బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోల సినిమాలో ఐటెం సాంగ్స్ కోసం రెడీ అవుతుంది. అలా టాప్ హీరోయిన్స్ ఐటమ్స్ కోసం రెడీ అవుతుంటే.. ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టి... ప్రస్తుతం ఆఫర్స్ లేని టైం లో స్టార్ హీరో సినిమాలో ఐటెం అవకాశమొస్తే... కళ్ళకద్దుకుని ఆ ఆఫర్ ని తీసుకోవాల్సింది పోయి.. రిజెక్ట్ చేసిందట. మరి ఆ పిల్ల ఎవరో కాదు.. RX 100 తో ఒక్కసారిగా లైం టైంలోకొచ్చిన హాట్ సుందరి పాయల్ రాజపుట్.
RX 100 లో అదరగొట్టే లిప్ లాక్స్ తో అందరి చూపుని తనవైపు తిప్పుకున్న పాయల్ రాజపుట్ కి ఆ సినిమా హిట్ తర్వాత మళ్ళీ అలాంటి అంటే RX 100 లో చేసిన ఇందు పాత్రను పోలిన పాత్రలే వస్తున్నాయని అసహనం వ్యక్తం చెయ్యడమేకాదు.. తాజాగా క్యాష్టింగ్ కౌచ్ పై బాంబ్ లాంటి వార్తను పేల్చిన పాయల్ రాజపుట్ ఇప్పుడు మరోమారు హాట్ టాపిక్ అయ్యింది. అది కూడా రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో ఐటెం సాంగ్ కోసమే పాయల్ ని సంప్రదించగా.. తాను హీరోయిన్ గా మాత్రమే చేస్తానని.. ఇప్పుడప్పుడే ఐటెం సాంగ్స్ చెయ్యనని వారిని పంపేసిందట. మరి స్టార్ హీరో సినిమాలో ఐటెం అంటే కళ్ళకద్దుకోవడం మానేసి ఇలా రిజెక్ట్ చెయ్యడం చూస్తుంటే పాపకి కాస్త ఎక్కువే అనిపిస్తుంది.
ఇక అఖిల్ - వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ గెస్ట్ రోల్ కోసం పాయల్ ని అడిగితే... గెస్ట్ రోల్స్ వద్దని అందట. ఇక సెకండ్ హీరోయిన్ పాత్రలను పాయల్ రిజెక్ట్ చేస్తుందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వినబడుతుంది. కాజల్ అగర్వాల్ - బెల్లకొండ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పాయల్ రాజపుట్ ని సంప్రదించడమే కాదు.. అడిగినంత పారితోషకం ఆఫర్ చేసినా... సెకండ్ హీరోయిన్ పాత్రలు చెయ్యనని... తనకి మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఉంటే చెప్పమని దర్శక నిర్మాతలకు చెబుతుందట. మరి ఒక్క సినిమాతోనే చరణ్ లాంటి హీరోకి నో చెప్పిందంటే.... పాయల్ సామాన్యమైన హీరోయిన్ కాదంటున్నారు.