Advertisementt

‘సైరా’ టీజర్‌పై ఈ సెటైర్లేంటి?

Wed 22nd Aug 2018 11:26 PM
chiranjeevi,sye raa narasimha reddy,teaser,gona gannareddy,gauthamiputra satakarni  ‘సైరా’ టీజర్‌పై ఈ సెటైర్లేంటి?
Comments on Chiru Sye Raa Teaser ‘సైరా’ టీజర్‌పై ఈ సెటైర్లేంటి?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా వదిలిన సై రా నరసింహారెడ్డి టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మెగాస్టార్ చిరు సై రా నరసింహారెడ్డిగా చెలరేగిపోయిన ఈ టీజర్ ని చూస్తుంటే మెగా అభిమానులకు పండగగానే ఉంది. మరి నిజంగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెరుగులు దిద్దుకుంటున్న సై రా నరసింహారెడ్డి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని చెప్పిన విషయం టీజర్ లో అడుగడుగునా కనబడుతుంది. రామ్ చరణ్ ఈ సినిమాని ఎంత బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నామో అని క్లారిటీ ఇవ్వనప్పటికీ.. బహు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని చెప్పడంలో అతిశయోక్తి కనబడం లేదు. ఈ టీజర్ లో సై రా నరసింహారెడ్డి గా చిరు లుక్స్ కానివ్వండి, గుర్రపు స్వారీ కానివ్వండి అన్ని అదుర్స్ అనిపించేలానే ఉన్నాయి. ప్రస్తుతం సై రా నరసింహారెడ్డి టీజర్ యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో ఉంది.

అయితే ఈ సై రా నరసింహారెడ్డి టీజర్ లో ప్రధాన ఆకర్షణ చిరు సై రా లుక్స్ తోపాటుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుందన్న కాంప్లిమెంట్స్ అయితే ఒక రేంజ్ లో పడుతున్నాయి. ఇక మిగతా వాటి విషయాల్లో అన్ని మామూలుగానే ఉన్నాయని.. కానీ కొత్తదనం మాత్రం పెద్దగా కనబడడం లేదని.. అందులోను చిరంజీవి సై రా గెటప్ చూస్తుంటే ... రుద్రమ దేవిలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర... తోపాటుగా చిరంజీవి గత చిత్రం కొదమ సింహం గుర్తుకొస్తున్నాయంటున్నారు. ఇక అల్లు అర్జున్ గోన గన్నారెడ్డే కాదు.. మగధీర సినిమాలో చరణ్ గుర్రం మీద కనిపించే రౌద్రం ఇప్పుడు చిరు సై రా లో గుర్రమెక్కి ఆంగ్లేయులను తెగ నరకడంతో కనబడుతుందంటున్నారు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ గుర్రమెక్కి ఈడ ఉంటా ఆడ ఉంటా తెలుగుజాతి లెక్క అంటూ అదరగొట్టే గెటప్ లో కనబడ్డాడు. ఇక ఇప్పుడు చిరు సై రా నరసింహారెడ్డిగా కోట గోడ మీద నుంచుని... తన బలగాన్ని యాక్టివ్ చేసే టైం లో అచ్చం అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర గుర్తొస్తుందంటున్నారు.

మరి గత పన్నెండేళ్లుగా చిరంజీవికి ఈ ఉయ్యాలవాడ జీవిత చరిత్రని సినిమా చెయ్యాలనే కోరిక ఇప్పుడు ఇన్నాళ్లకు నెరవేరిందని.. రామ్ చరణ్ చెబుతున్నాడు. మరి చిరుకి చారిత్రాత్మక చిత్రాలు పెద్దగా కలిసిరావనే.. ఆయన తన కెరీర్ లో ఇలాంటి చిత్రాల జోలికి పోలేదు. ఇక ఇప్పుడు సై రా నరసింహ రెడ్డి టీజర్ చూసిన మెగా యాంటీ ఫ్యాన్స్ అప్పుడే సై రా టీజర్ లో చిరంజీవి గుర్రపు స్వారీ చేసిన సీన్స్ తో బాలకృష్ణ గౌతమీపుత్రలో చేసిన గుర్రపు స్వారీని పక్క  పక్కనే పెట్టి చూసేస్తూ సై రా మీద సెటైర్స్ వేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ ట్రేండింగ్ లో గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ ట్రైలర్ కూడా ట్రెండింగ్లో కనబడుతుంది. మరి చిరంజీవి సై రా పాత్ర కోసం పడిన కష్టం ఆయన లుక్స్ లో స్పష్టంగా తెలుస్తుంది. ఇక పాత సినిమాలతో పోలిక పెట్టడం అనేది ఎంత వరకు కరెక్టో కూడా క్లారిటీ లేదు ఎందుకంటే.. ఇప్పుడు పలు టివి ఛానల్స్ లో పాత సినిమాల హడావిడి మాములుగా లేదు. ఒక ఛానల్ మీద పోటీగా మరో ఛానల్ సినిమాల మీద సినిమాలతో ప్రేక్షకులను పడేస్తున్నాయి. అందుకే ఎప్పుడూ ఏదో కొత్తదనం కోసం ప్రేక్షకుడు ఎదురు చూస్తూనే ఉంటున్నాడు.

Comments on Chiru Sye Raa Teaser:

Chiru Sye Raa Teaser Compared with Gona Gannareddy and Gauthamiputra Satakarni

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ