ఈ మధ్యన మెగా ఫ్యామిలీలోని లుకలుకలు గురించిన వార్తలు మీడియాలో పెద్దగా వినబడడం లేదు. గతంలో మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్యన విబేధాలున్నాయంటూ.. మీడియాలో అనేక రకాల వార్తలొచ్చాయి. నిజంగానే నాగబాబు, పవన్ ని కోప్పడిన తీరు చూస్తే అందరూ అది నిజమనే ఫిక్స్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ గత ఏడాది కాలం నుండి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. తనకి, అన్నాకి పుట్టిన బాబుకి అన్న చిరు పేరు కలిసేలా పెట్టడమే కాదు...తన కొడుకుని తీసుకుని అన్న ఇంటికి వెళ్లడం దగ్గరనుండి... రామ్ చరణ్ బర్త్ డే కి ఇంటికెళ్లి మరీ విషెస్ చెప్పడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాయి. ఇక ఈ ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ... రామ్ చరణ్ రంగస్థలం సినిమా చూసి మెచ్చుకోవడమే కాదు... ఆసినిమా విజయోత్సవానికి హాజరై మెగా అభిమానులను ఆనందపరిచాడు.
ఇక అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాకి బూస్ట్ ఇచ్చాడు. నిన్నటికి నిన్న చిరు 151 వ మూవీ సై రా నరసింహారెడ్డి టీజర్ ని చూసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రామ్ చరణ్ చెప్పాడు. ఇక ఈ రోజు అన్నగారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా... పిల్లలతో కలిసి చిరు ఇంటికి వెళ్లి మరీ తన అన్న చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేనా.. అన్న చిరుకి ఫ్లవర్ బొకే ఇచ్చి భార్య పిల్లలతో కలిసి అన్నగారితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. రాజకీయాలతో తన మేకప్ ని పక్కనపెట్టిసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కుటుంబంతో కలిసి చాలా స్టైలిష్ గా అన్నగారు దగ్గరకి వెళ్లి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. మరి ఇలా పవన్ కళ్యాణ్ అన్నగారితో గడిపిన క్షణాలు చూసిన మెగా ఫ్యాన్స్ చిరు బర్త్ డే పార్టీతో పాటుగా ఈ విషయాన్నీ కూడా పండగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మీరు పవన్ కళ్యాణ్ భార్య పిల్లలు చిరుకి బర్త్ డే విషెస్ చెబుతున్న ఫొటోస్ చూసి తరించండి.