కత్తి పట్టుకున్న వాడి ఆ కత్తితోనే మరణిస్తాడని మన పెద్దలు చెబుతారు. ఇక విషయానికి వస్తే ఓ సామాజిక వర్గానికి దేవుడిలా, మరో సామాజిక వర్గానికి దెయ్యంలా అనిపించే వ్యక్తి స్వర్గీయ పరిటాల రవి. ఆయనంటే ప్రాణం ఇచ్చే వారితో పాటు ఆయన పేరు చెబితేనే మండిపడే వారు కూడా ఎందరో ఉన్నారు. ఆయన తన తండ్రి బయోపిక్‌గా తీసిన 'శ్రీరాములయ్య' చిత్రానికి ఎన్‌కౌంటర్ శంకర్ దర్శకత్వం వహించగా మోహన్‌బాబు, హరికృష్ణ, సౌందర్యవంటి వారు నటించారు. ఈ సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన సందర్భంగా జరిగిన బాంబు పేలుడులో పలువురు అమాయక జర్నలిస్ట్‌లు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఇక విషయానికి వస్తే తాజాగా ఈ చిత్రం గురించి రచయితగా ఈ మూవీకి వర్క్ చేసిన పరుచూరిగోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం అనేక అవాంతరాలను, ఆటంకాలను దాటుకుని మొదలైంది. పరిటాల సొంత గ్రామమైన వెంకటాపురంలో ఉండి పరిటాల ఇంట్లో ఉంటూ షూటింగ్ చేస్తున్నాం. 'అన్నా భయం వేస్తోందా ?' అని తరుచుగా పరిటాల రవి అడిగేవాడు. 'నువ్వుండగా మాకేం భయం అని నేను అంటుంటే వాడిని. నువ్వు ఉండగా ఇక్కడ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరికీ నువ్వే కొండంత అండ అనేవాడిని. ఆ మాట విని ఆయన నవ్వేవాడు. వెంకటాపురంలో పదిరోజుల పాటు ఉండి, స్థూపం దగ్గర మరికొన్ని చోట్ల షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాం. ఆ సినిమా అద్భుతంగా ఆడింది. మంచి పేరు తెచ్చింది. 100రోజుల షీల్డ్ మా ఇంటికి వచ్చింది' అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చాడు.