Advertisementt

నాగార్జున‌, నాని దేవ‌దాసు టీజ‌ర్ విడుద‌ల‌

Sat 25th Aug 2018 11:25 PM
devadas,nagarjuna,nani,devadas teaser released  నాగార్జున‌, నాని దేవ‌దాసు టీజ‌ర్ విడుద‌ల‌
Devadas teaser launch నాగార్జున‌, నాని దేవ‌దాసు టీజ‌ర్ విడుద‌ల‌
Advertisement
Ads by CJ

తెలుగు ఇండ‌స్ట్రీలో అంద‌రి ఆస‌క్తిని త‌న‌వైపు తిప్పుకుంటున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాసు. నాగార్జున‌, నాని హీరోలుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఈ టీజర్ ఆద్యంతం న‌వ్వుల‌తో నిండిపోయింది. నాగార్జున డాన్.. నాని డాక్ట‌ర్ గా న‌టిస్తున్నారు. ఒక్క పాట మిన‌హా దేవ‌దాసు షూటింగ్ అంతా పూర్తైంది. ఈ మ‌ధ్యే బ్యాంకాక్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని వ‌చ్చారు. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఆగ‌స్ట్ మొద‌ట్లోనే విడుద‌లైంది. దీనికి ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ ద‌త్ సైనూద్దీన్ సినిమాటోగ్రాఫర్. వైజ‌యంతి సంస్థ‌లో సి ధ‌ర్మ‌రాజు సమ‌ర్ప‌ణ‌లో అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రం విడుద‌ల కానుంది. 

న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌.

Click Here for Teaser

Devadas teaser launch :

Nag, Nani movie Devadas teaser Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ