గోవా కోవా, నాభి సుందరి, ఇల్లీబేబీగా పేరొంది తెలుగులో ఓ వెలుగు వెలిగి కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి తెలుగు కమర్షియల్ హీరోయిన్‌గా ఇలియనాకి మంచి పేరుంది. ఆ తర్వాత ఆమె తెలుగు వద్దని చెప్పి బాలీవుడ్డే ముద్దు అంటూ బిటౌన్ ఫ్లైట్ ఎక్కింది. మరలా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'అమర్‌అక్బర్‌ఆంటోని' చిత్రం ద్వారా టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తోంది.
ఈమె తాజాగా ఓ మ్యాగజిన్ కి ఇచ్చిన ఫొటోషూట్‌లోని తనకి నచ్చిన ఫొటోపిక్ ఒకదానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పొందుపరిచింది. ఈ ఫొటో బాగా నచ్చిందని చెబుతూ, ఆ ఫొటోకి ఉన్న ప్రాధాన్యం వివరించింది. ఎలాంటి ఫొటోషాన్ ఎడిటింగ్‌లు గానీ, ఎయిర్‌బ్రెష్ వంటి బుల్ షిట్స్ ఏమీ లేని ఫొటో ఇదని తెలిపింది. వైట్ కలర్ టూవీస్ బికినీతో ఉన్న ఈ ఫొటో ఆమె అందాలను తనివి తీరా ఎంజాయ్ చేయాల్సిందేమరి...! కల్ట్సస్ జూలియర్ తీసిన ఈ ఫొటోకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫొటోకి ఐదు లక్షల లైక్స్ రావడం విశేషం. దీనిని బట్టి ఇల్లీబేబికి ఇప్పటికీ ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అర్ధమవుతోంది కదూ.