టాలీవుడ్ లో సక్సెస్ కాలేక ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి కష్ట పడుతున్న తాప్సి పన్ను అవకాశమొస్తే తెలుగులోనూ నటిస్తుంది. బాలీవుడ్ కి చెక్కేసిన తాప్సి తెలుగు దర్శక నిర్మాతలను కామెడీగా మాట్లాడినప్పటికీ.. మళ్ళీ తెలుగులో అవకాశాలొస్తే వదలడం లేదు. మొన్నీ మధ్యన ఆనందో బ్రహ్మ సినిమాతో కామెడీ హిట్ అందుకున్న తాప్సి.. ఆ సినిమాలో ఆత్మగా అందరిని మెప్పించింది. చనిపోయి ఆత్మగా మారి అల్ల్లరి చేసే కేరెక్టర్ లో తాప్సి ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆది పినిశెట్టి హీరోగా రితిక సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన నీవెవరో సినిమాలో తాప్సి కీలక పాత్రలో అదరగొట్టింది. ఆ సినిమాలో తాప్సి పన్ను ఆది పినిశెట్టికి ధీటుగా నటించి మెప్పించింది.
వెన్నెలగా నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో తాప్సి నటన చాలా బావుంది. ఆ సినిమాలో సంపన్నులైన అంధులను ఎంచుకుని.. వారిని ప్రేమలో దింపి.... వారినుండి డబ్బు తీసుకుని మోసం చేసే కేరెక్టర్ లో అదరగొట్టింది. ఆది పినిశెట్టిని అంధుడిగా ఉన్నప్పుడు ప్రేమలోకి దింపి అతని నుండి 20 లక్షలు కొట్టేసి పారిపోవాలనుకుంటే.. ఆదికి అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ అయ్యి... తాప్సికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేకపోయినా.. కళ్ళు వచ్చాక తాప్సిని వెతుకుతూ పోతే.. తాప్సి గురించి నిర్ఘాంతపోయే నిజాలు తెలుసుకోవడం.. చివరికి తాప్సి జైలుకెళ్లడం వంటి సీన్స్ లో తాప్సి మంచి పెరఫార్మెన్స్ ఇచ్చింది. నీవెవరో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ... తాప్సి నటనకు మాత్రం ఫుల్ మార్కులు పడుతున్నాయి. మరి వెన్నెలగా అందరిని మెప్పించిన తాప్సికి టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం రావడం లేదు. చూద్దాం మళ్ళీ తాప్సి ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో అనేది.