కొన్నికొన్ని విషయాలు తప్పుగా ప్రచారం అయితే నటీనటులకు ఎంత డ్యామేజీనో, వారికి అనుకూలంగా వచ్చే వార్తలు వారికి అంత పాపులారీటీని తెస్తాయి. ఇటీవల కేరళ వరద బాధితులకు విజయ్ ఏకంగా రూ. 14 కోట్లు విరాళం ఇచ్చాడనే విషయం వైరల్ అయింది. కానీ అది నిజం కాదని, ఆయన అందించిన సాయం కేవలం 70లక్షలే అన్న విషయం తర్వాత బయటికి వచ్చింది. ఇప్పుడు అదే విషయంలో పోర్న్‌స్టార్ సన్నిలియోన్ కూడా చేరింది.
ఆమె గతంలో ఒకసారి తిరువంతనపురంకి వెళ్లితే అక్కడికి వచ్చిన జనాలను చేసి వర్మ వంటి వాడే మోహన్‌లాల్ , మమ్ముట్టిల కంటే కేరళలో సన్నికే ఫ్యాన్స్ ఎక్కవ అని చెప్పాడు. ఇక ఎలా వచ్చిందో ఏమో తెలియదు గానీ తాజాగా సన్ని కేరళ వరద బాధితుల కోసం 5కోట్లు విరాళం ఇచ్చిందనే న్యూస్ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసింది. దాంతో మన హీరోల కంటే పోర్న్‌స్టార్ నయ్యమని కొందరు కౌంటర్లు కూడా మొదలుపెట్టారు.
కానీ సన్ని తన భర్త వెబర్‌తో కలిసి ఇతర బాలీవుడ్ వారి సాయంతో 1200కేజీల బియ్యం, పప్పును మాత్రమే ఇచ్చిందని ఆమె స్వయంగా తెలిపింది...! ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో? ఎలా పుట్టిస్తారో కదా..!