ఈమద్యకాలంలో క్రియేటివ్ జీనియస్ మణిరత్నంకి సరైనహిట్ పడలేదు. వచ్చినంతలో ‘ఓకే బంగారం’ చిత్రం నేటి యూత్‌కి కనెక్ట్ అయింది. కాగా ప్రస్తుతం మణిరత్నం తమిళంలో ‘చెక్క చివంత వానం’ చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులోకి ‘నవాబు’గా విడుదల కానుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రధాన పాత్రలైన అరవింద్‌స్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్, ప్రకాష్‌రాజ్, జ్యోతిక, జయసుధ, ఆదితీరావు తదితరుల పాత్రలను చూపిస్తూ వాటిపై కట్ చేశారు.
వరద పాత్రలో అరవింద్‌స్వామిని, త్యాగు పాత్రలో అరుణ్‌విజయ్‌ని, రుద్ర పాత్రలో శింబుని, రసూల్ పాత్రలో విజయ్‌సేతుపతిని, భూపతి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ని ఈ ట్రైలర్ ద్వారా పరిచయం చేశారు. యాక్షన్‌కి, ఎమోషన్స్‌కి ప్రాధాన్యం ఇస్తూ కట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ప్రతి పాత్రను డిఫరెంట్‌గా డిజైన్ చేశారని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. త్వరలోనే ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరి ఈ చిత్రంతోనైనా మణిరత్నం మరలా పూర్వపువైభవాన్ని సాధిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది!