Advertisementt

ఎన్టీఆర్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్!!

Mon 27th Aug 2018 05:59 PM
aravinda sametha,ntr,fans,teaser 2,disappointment  ఎన్టీఆర్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్!!
No Teaser 2 for Aravinda Sametha ఎన్టీఆర్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్!!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ తన జోనర్ నుండి బయటికి వచ్చి మొదటిసారి ఒక యాక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మాటల మాంత్రికుడు సినిమాలకు మాటలు రాస్తే అవి తూటాలులా పేలి కడుపుబ్బా నవ్విస్తాయని ఆయన గత సినిమా లు రుజువు చేశారు. కానీ తాజాగా ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న అరవింద సమేత - వీర రాఘవ సినిమా మాత్రం త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ ను గాని.... ఆయన కామెడీ డైలాగ్స్ కానీ లేకుండా తెరకెక్కుతుందా అనే డౌట్ అరవింద సమేత టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఎందుకంటే అరవింద సమేత టీజర్లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో పాటుగా... ఊర మాస్ యాక్షన్ మాత్రమే చూపించారు. ఆ టీజర్ ఎన్టీఆర్  ఫాన్స్ ని ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసినా....  త్రివిక్రమ్ స్టైల్ మిస్ అయ్యిందంటూ కామెంట్స్ పడ్డాయి.

అయితే ఫస్ట్ లుక్ లో రెండు లుక్స్ అంటే ఒకటి యాక్షన్ లుక్, మరొకటి రొమాంటిక్ లుక్ వదిలినట్టుగా టీజర్ ను కూడా ఒకటి యాక్షన్ తోనూ, మరొకటి రామాంటిక్ గాను వదులుతున్నారనే ప్రచారం బాగా జరిగింది. ఇక అరవింద సమేత రెండో టీజర్ కూడా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13 న వదలబోతున్నారంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలెట్టారు. మరి రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న అరవింద సమేత రెండో టీజర్ లేదని అరవింద నిర్మాతలు హరిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు క్లారిటీ ఇచ్చారు. అరవింద సమేత ఫస్ట్ టీజర్ బ్లాక్ బస్టర్ అయ్యింది... కానీ రెండో టీజర్ వస్తుందని చెబుతున్న వార్తల్లో నిజం లేదని తేల్చేసింది.

ఇక రెండో టీజర్ లేదుగాని.. అరవింద సమేత ట్రైలర్ ని మాత్రం డైరెక్ట్ గా విడుదల చేస్తామని.. త్వరలోనే అరవింద ట్రైలర్ డేట్ ఎనౌన్స్ చేస్తామని కూడా అరవింద సమేత నిర్మతలు చెబుతున్నారు. మరి అరవింద సమేత సెకండ్ టీజర్ కూడా వస్తుంది అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇది డిస్పాయింట్ అయినా.. అరవింద ట్రైలర్ త్వరలోనే రాబోతుందని ఫాన్స్ ఖుషీగా అవుతున్నారు. ఇకపోతే పూజ హెగ్డే, ఇషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. జగపతి బాబు విలన్ గా, నాగబాబు ఎన్టీఆర్ ఫాదర్ కేరెక్టర్ లో నటిస్తున్నారు. 

No Teaser 2 for Aravinda Sametha:

Aravinda Sametha Teaser 2 Disappointment

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ