Advertisementt

అమ్మో... ప్రియా పెద్దముదురే!

Tue 28th Aug 2018 01:27 PM
priya prakash varrier,donates,1 lakh,kerala flood victims  అమ్మో... ప్రియా పెద్దముదురే!
Priya Varrier Donates One Lakh for Kerala అమ్మో... ప్రియా పెద్దముదురే!
Advertisement
Ads by CJ

తీవ్రమైన కష్టాలలో ఉన్న కేరళ రాష్ట్రానికి తన వంతు సాయం చేస్తానని 'ఒరు ఆధార్‌ లవ్‌' నాయిక, సోషల్‌మీడియా సెన్సేషన్‌ ప్రియా వారియర్‌ తెలిపిన విషయం తెలిసిందే. అయితే తనకు ప్రచారం వద్దని, పబ్లిసిటీ కోసం ఈ పని చేయడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఓనం పర్వదినం రోజు తన వంతుగా కేరళ బాధితులకు చిన్న సాయం చేశానని, తన ఫాలోయర్స్‌ అంతా తమ వంతు సాయం చేయాలని ఆమె కోరింది. మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చేసి చూపిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని తెలిపిన ఆమె విరాళం ఇచ్చిన వారిని పొగడకపోయినా ఫర్వాలేదు. కానీ చిన్న చూపు చూస్తూ తక్కువ చేసి మాట్లాడవద్దని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తెలిపింది. 

కాగా 'ఒరు ఆధార్‌ లవ్‌' చిత్రంలోని టీజర్‌లో తన ఓరకంటి చూపుతో సంచలనం సృష్టించిన ప్రియా వారియర్‌ తన ఒక్కో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు ఏకంగా రూ.8లక్షలను తీసుకుంటోంది. ఇలా ఒక్క పోస్ట్‌కి రూ.8లక్షలు తీసుకుంటూ, కేవలం లక్ష విరాళంగా ఇచ్చి తనకు ప్రచారం వద్దని సోషల్‌మీడియా వేదికగా పబ్లిసిటీ చేసుకుంటున్న ప్రియా వారియర్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. 

మరి ఇదంతా చూస్తుంటే ఈ మలయాళీ ముద్దు గుమ్మ వందగ్రాముల చికెన్‌కి వెయ్యిరూపాయల మసాలా అన్న చందంగా తన పబ్లిసిటీని వద్దంటూ చేస్తున్న విధానం చూస్తే మాత్రం ఈమె మహా ముదురని అర్ధమవుతోంది. చేసేది గోరంత.. చెప్పేది కొండంత అనే సామెత ఈమెకి సరిగ్గా సూట్‌ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Priya Varrier Donates One Lakh for Kerala:

Priya Prakash Varrier Gets Trolled After She Donates Rs 1 Lakh to The Kerala Flood Victims

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ