Advertisementt

నన్ను అలానే ఆటపట్టిస్తుంటారు: విజయ్ దేవరకొండ

Sat 01st Sep 2018 03:15 PM
vijay deverakonda,friend,friendship,geetha govindam,chiranjeevi,star status  నన్ను అలానే ఆటపట్టిస్తుంటారు: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda About Friendship నన్ను అలానే ఆటపట్టిస్తుంటారు: విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

ఏదైనా రంగంలో ప్రవేశించే ముందు తర్వాత కూడా మనకంటూ కొందరు ఉత్తమ స్నేహితులు, చిన్ననాటి ఫ్రెండ్స్‌, క్లాస్‌మేట్స్‌ ఉంటారు. అయితే మనకు ఏదైనా రంగంలో స్టార్‌స్టేటస్‌ వచ్చిన తర్వాత మాత్రం పాత స్నేహాలు, స్నేహితులు దూరంగా జరుగుతుంటారు. కొత్త కొత్త స్నేహితులు వచ్చి చేరుతూ ఉంటారు. ఉదాహరణకు మెగాస్టార్‌ చిరంజీవినే తీసుకుంటే ఆయన క్లాస్‌మేట్స్‌ అయిన నారాయణరావు, హరిప్రసాద్‌, ప్రసాద్‌బాబు, పిచ్చికొట్టుడు సుధాకర్‌, రాజేంద్రప్రసాద్‌ వంటివారు ఆటోమేటిగ్గా దూరం అయిపోతే కొత్త బంధాలు, బంధువులు, స్నేహితులు వారి స్థానంలో వచ్చి చేరారు.

స్టార్‌ స్టేటస్‌ వచ్చిన తర్వాత ఆయా స్టార్స్‌ స్వయంగా పాత స్నేహితులను దూరంగా చేసుకుంటారు. మరికొందరు స్నేహితులు మాత్రం మన స్నేహితుడు స్టార్‌ అయ్యాడు కదా...! అనే ఉద్దేశ్యంతో తామే దూరంగా జరుగుతూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితి ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత ‘గీతాగోవిందం’తో 100కోట్ల క్లబ్‌లో చేరి స్టార్‌ అయిన విజయ్‌దేవరకొండకు ఎలా అనుభవం అవుతోంది? అనే ప్రశ్నకు విజయ్‌ సమాధానం చెబుతూ, నా ఫ్రెండ్స్‌ కూడా నేను స్టార్‌ని అయ్యాను అని దూరంగా ఉండాలని అనుకుంటే బాగుండేది. కానీ అలా అందరు అనుకోరు. నిన్నరాత్రి కూడా నా స్నేహితులందరు నాతోనే ఉన్నారు. నాతో బయటకు రావాలంటే ఇబ్బంది పడతారు గానీ ఇంటికి మాత్రం ఫ్రీగా వచ్చేస్తూ ఉంటారు. 

చిన్నప్పటి నుంచి మేమంతా స్నేహితులం. ఇప్పటికీ వారు నన్ను అలానే ఆటపట్టిస్తూ ఉంటారు. గోల చేస్తూ ఉంటారు. మేము కలిసినప్పుడు లైఫ్‌, ప్రొఫెషన్‌, కెరీర్‌ అంటూ సీరియస్‌ విషయాలను ఆలోచించం. సరదాగా గేమ్స్‌ ఆడుతూ ఎంజాయ్‌చేస్తూ ఉంటాం అంతే. నిజం చెప్పాలంటే చిల్లరపనులు, టైం వేస్ట్‌ పనులే ఎక్కువ.. అంటూ చెప్పుకొచ్చాడు. 

Vijay Deverakonda About Friendship :

No Change in Hero Vijay Deverakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ