Advertisementt

‘శ్రీనివాసకళ్యాణం’ ఎఫెక్ట్ అనుకుంటా..!

Sat 01st Sep 2018 07:46 PM
hello guru premakosame,dil raju,re shoots,srinivasa kalyanam  ‘శ్రీనివాసకళ్యాణం’ ఎఫెక్ట్ అనుకుంటా..!
Hello Guru Premakosame in Re shoots ‘శ్రీనివాసకళ్యాణం’ ఎఫెక్ట్ అనుకుంటా..!
Advertisement
Ads by CJ

దిల్‌రాజుకి ఇప్పుడు పూర్తిగా మాత్రం కలిసి రావడం లేదు. అలాగని ఆయనేమీ ఫ్లాప్‌ల్లో లేడు. ఫిదా వంటి హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ‘డిజె’ చిత్రం కూడా కమర్షియల్‌గా బాగానే వర్కౌట్‌ అయిందని చెబుతాడు. ఇటీవల ఆయన తనకు అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టిన సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ‘శతమానం భవతి’ తర్వాత మరలా సతీష్‌ వేగేశ్నతోనే నితిన్‌ హీరోగా ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రం నిర్మించాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది.

ఇక ఈయన ప్రస్తుతం అశ్వనీదత్‌ భాగస్వామ్యంలో మహేష్‌బాబు 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రం నిర్మిస్తున్నాడు. మరోవైపు ‘సినిమా చూపిస్తా మావా, నేను లోకల్‌’ వంటి ఎంటర్‌టైనర్స్‌ తీసిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం కనుక హిట్‌ అయితే త్రినాథరావు నక్కిన హ్యాట్రిక్‌ హిట్‌ కొడతాడు. మరోవైపు ‘నేను..శైలజ’ తర్వాత మరో హిట్‌ లేని రామ్‌కి కూడా ఈ చిత్రం కీలకం. 

శ్రీనివాసకళ్యాణం ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకున్న దిల్‌రాజు ప్రస్తుతం ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంపై దృష్టి పెట్టాడు. ఈ చిత్రం రషెష్‌ని చూసిన ఆయన ఇందులోని రెండు మూడు సీన్స్‌ సరిగా రాకపోతే మరలా వాటిని రీషూట్‌ చేయమని, అలాగే ఏది ఎలా ఉన్నా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న విజయదశమి కానుకగా విడుదల చేయాలని కూడా గట్టిగా చెప్పాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రం దిల్‌రాజు, త్రినాథరావు, రామ్‌, అనుపమపరమేశ్వరన్‌ వంటి వారికి ఎలాంటి ఫలితం అందిస్తుందో వేచిచూడాల్సివుంది..! 

Hello Guru Premakosame in Re shoots:

Dil Raju Suggestions to Hello Guru Premakosame

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ