ఫిల్మ్ జర్నలిజంలో టాలీవుడ్.. బాలీవుడ్ కంటే ఎంతో బెటర్ అని చెప్పాలి. ఇక్కడ ఎక్కువగా వృత్తిపరంగా టార్గెట్ చేస్తారుగానీ వ్యక్తిగత అంశాల మీద ఫోకస్ చేయరు. కానీ బాలీవుడ్ విషయానికి వస్తే అక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న పత్రికలు కూడా నటీనటుల వ్యక్తిగత జీవితాలపై లేనిపోని వార్తలు రాస్తూ ఉంటాయి. ఇక విషయానికి వస్తే బాలీవుడ్ హీమ్యాన్‌గా పేరొందిన స్టార్ హృతిక్‌రోషన్. గతంలో ఈయనకు, కంగనారౌనత్‌కి మద్య ఏదో ఉండేదనేది నిజమే. ఈ విషయాన్ని ఇద్దరు ఎక్కడా ఖండించలేదు. అయినా ఇప్పటికీ ఆ విషయంలో కంగనా.. హృతిక్‌ని టార్గెట్ చేస్తూనే ఉంటుంది.
మరోవైపు హృతిక్ తాజాగా దిశాపటానీతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో హృతిక్ కంగనారౌనత్‌ని ఏడిపించిన విధంగానే ఈ చిత్రం విషయంలో దిశాపటానీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, అవకాశాలు రావాలంటే తనతో డేటింగ్ చేయాల్సిందేనని వేధించాడని ఎంతో పేరు ప్రఖ్యాతులున్న పత్రికలు కథనాలు అల్లాయి. దీనిపై హృతిక్‌తో పాటు దిశాపటానీ కూడా స్పందించింది.
హృతిక్ మాట్లాడుతూ, మీకు పాపులారీటీ కావాలంటే నేరుగా నన్నే అడగవచ్చుకదా...! ఇలాంటి అసభ్య అవాస్తవ విషయాలు ప్రచురించడం ఎందుకు? అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దిశా కూడా ఈ విషయంలో వాస్తవం లేదని పోస్ట్ పెట్టింది. నాగురించి, హృతిక్ సార్ గురించి అర్ధంలేని వార్తలు ప్రచారం అవుతోన్నాయి. వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదు. నేను ఆయన్ని కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అంతటి గొప్ప వ్యక్తి గురించి ఇలాంటి వార్తలు వస్తుంటే ఖండించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆయన నటించే చిత్రంలో ఖచ్చితంగా నటించడానికి ఎదురుచూస్తున్నానని తెలిపింది.