వివి వినాయక్ చేతుల మీదుగా పవనిజం 2 మోషన్ పోస్టర్ విడుదల
ఆర్ కె స్టూడియోస్ పతాకం పై గుంటూరు టాకీస్ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన నిర్మాత రాజశ్రీ ఇప్పుడు పవనిజం 2 సినిమాని నిర్మిస్తున్నారు. మధు బాబు, పావని హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ వీరాభిమాని కృష్ణ చైతన్య దర్శకుడు. సమాజంలో ఎవరికీ సరైన బాధ్యత ఉండట్లేదు. అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తన ప్రేరణతో సొసైటీని మార్చే భాద్యత తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి పాలిటిక్స్ లో ప్రజల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చాడనేదే ఈ చిత్రం కథాశం.
అయితే సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవనిజం 2 కు సంబంధించిన మొదటి మోషన్ పోస్టర్ ను అగ్ర దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేసారు.
ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయన మీద అభిమానంతో అయన ఉద్ధేశాలని అయన సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్లాలని పవనిజం 2 సినిమా తీశారు. ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అని పవన్ కళ్యాణ్ గారికి నచ్చే సినిమా కావాలి అని కోరుకుంటున్నాను. దర్శకుడు కృష్ణ చైతన్యకి మంచి పేరు రావాలని నిర్మాత రాజశ్రీ గారికి మంచి డబ్బులు రావాలి అని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
నిర్మాత రాజశ్రీ మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా సినిమా పవనిజం 2 మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన వివి వినాయక్ గారికి నా కృతఙ్ఞతలు. వారు మా సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేయటం చాలా సంతోషం. మా సినిమా కథ చాలా బాగా వచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాని బాగా చిత్రీకరించారు. సినిమా షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌లో విడుదల చేస్తాము" అని తెలిపారు.