Advertisementt

అది అజితే చెప్పాలంటున్నాడు..!

Mon 03rd Sep 2018 01:49 PM
venkat prabhu,next movie,thala ajith  అది అజితే చెప్పాలంటున్నాడు..!
Director Venkat Prabhu About Ajith Film అది అజితే చెప్పాలంటున్నాడు..!
Advertisement
Ads by CJ

సంగీత దర్శకుడు ఇళయరాజా చిన్నాన్న కుమారుడిగా, గంగై అమరన్‌ తనయునిగా నటునిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత తనదైన శైలిలో దర్శకునిగా మారి వరుస విజయవంతమైన చిత్రాలను తీస్తున్న దర్శకుడు వెంకట్‌ ప్రభు. ఈయన కజిన్స్‌ యువన్‌ శంకర్‌రాజా, కార్తీక్‌రాజా, గాయని భవతారిణి. వెంకట్‌ ప్రభు కెరీర్‌ కూడా మొదట ప్లేబ్యాక్‌ సింగర్‌గానే మొదలైంది. తర్వాత నటునిగా రాణించి, ఆ తర్వాత దర్శకునిగా అవతారం ఎత్తాడు. ముఖ్యంగా ఆయనకు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీబీ చరణ్‌, దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్‌లతో మంచి స్నేహం ఉంది. 

ఇక ఈయన తీసిన మొదటి చిత్రం 'చెన్నై 600028' ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత 'సరోజ, గోవా' చిత్రాలు కూడా మంచి గుర్తింపునే తెచ్చాయి. ఆ తర్వాతి చిత్రంగా వెంకట్‌ ప్రభుకి తాలా అజిత్‌ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. అజిత్‌తో ఆయన తీసిన 'మన్‌కథా' చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులో అర్జున్‌, త్రిష తదితరులు కూడా నటించారు. ఆ తర్వాత వెంకట్‌ ప్రభు 'బిర్యాని' సూర్యతో 'మాస్‌'తో పాటు 'చెన్నై 28కి సీక్వెల్‌ కూడా తీశాడు. ఇక విషయానికి వస్తే ఆయన అజిత్‌తో తీసిన 'మన్‌కథా' చిత్రం విడుదలై ఏడు సంవతర్సరాలు అయింది. ఈ సందర్భంగా అజిత్‌ అభిమానులు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. 

ఈ సందర్భంగా పలువురు అభిమానులు 'మన్‌కథా' కి సీక్వెల్‌ ఎప్పుడు చేస్తారు? అంటూ వెంకట్‌ ప్రభుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో స్పందిస్తూ 'తాలా అభిమానులందరికీ మంగాతైడే శుభాకాంక్షలు. మీరు ప్రశ్నించడానికన్నాముందే నేను స్పందిస్తాను. మీరడుగుతున్న సీక్వెల్‌ విషయమై 'తాలా' అజిత్‌ స్పందిస్తేనే బాగుంటుంది...' అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ చిత్రం ఏడేళ్లయినా ఇంకా ప్రేక్షకులు మర్చిపోవడం లేదంటే అది నిజంగా ఆశ్చర్యకరమేనని చెప్పాలి. 

Director Venkat Prabhu About Ajith Film:

Venkat Prabhu talks about his next with Thala Ajith?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ