Advertisementt

విజయ్ దేవరకొండ ఏం చేసినా న్యూసే!

Mon 03rd Sep 2018 06:45 PM
vijay deverakonda,green challenge,arjun reddy,geetha govindam  విజయ్ దేవరకొండ ఏం చేసినా న్యూసే!
Vijay Deverakonda The Sensational Star విజయ్ దేవరకొండ ఏం చేసినా న్యూసే!
Advertisement
Ads by CJ

అర్జున్‌రెడ్డి, తాజాగా గోవిందం అయిన విజయ్‌దేవరకొండ తెలంగాణ నుంచి వచ్చిన స్టార్‌ అయ్యాడు. కత్తికాంతారావు, నితిన్‌ల తరహాలో ఒక విధంగా చెప్పాలంటే నితిన్‌ కంటే వేగంగా దూసుకెళ్తున్నాడు. ఇక ఈయన తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి దగ్గరి బంధువు అని కూడా తెలిసిందే. ఇక తనదైన యాటిట్యూడ్‌తో ‘అర్జున్‌రెడ్డి’ వేడుకలో బూతులతో ఆయన చేసిన ప్రసంగం, చిల్‌ తాతయ్యా అంటూ విహెచ్‌ హనుమంతరావుని ట్రోల్ చేసిన తీరు అందరికీ తెలిసిందే. 

ఇక ఇటీవల తనకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వస్తే దానిని వేలం వేసి వచ్చిన రూ.25 లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి నిధికి విరాళం ఇచ్చాడు. ఇలా ఆయన తన చిత్రాలతోనే కాదు.. వ్యక్తిగతంగా కూడా తన యూటిట్యూడ్‌ డిఫరెంట్‌ అని చాటుకుంటూ ఉన్నాడు. ఇక విషయానికి వస్తే ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ తరహాలోనే ప్రస్తుతం గ్రీన్‌చాలెంజ్ బాగా పాపులర్‌ అవుతోంది. నటీనటులు, క్రీడాకారులు, రాజకీయ వేత్తలు కూడా దీనిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 

ఇక తాజాగా అర్జున్‌రెడ్డి కిడాంబి శ్రీకాంత్‌, బొంతు రామ్మోహన్‌లు తనకి విసిరిన గ్రీన్‌చాలెంజ్‌ని స్వీకరించాడు. ఈయన కాకినాడ యువకులతో కలిసి మొక్కలు నాటాడు. తర్వాత వారితో కలిసి భోజనం చేసి సరదాగా గడిపాడు. ఇటీవల ‘గీతాగోవిందం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన త్వరలో ‘ట్యాక్సీవాలా, నోటా, డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

Vijay Deverakonda The Sensational Star:

Vijay Deverakonda Accepted Green Challenge

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ