మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అయినా కూడా ఆయన హనుమంతుని భక్తుడు కావడం, ఆయన తల్లి పేరు అంజనాదేవి కావడం, ఆమె సలహా, ఆశీస్సులతోనే హనుమంతుని మరో నామమైన చిరంజీవి అని పెట్టుకుని మెగాస్టార్‌గా ఎదిగారు. ఇక పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అసలు పేరు కూడా మొదటి చిత్రాలలో కూడా కళ్యాణ్‌బాబునే. కానీ ఆయన దశ కూడా హనుమంతుని మరో నామమైన పవన్ పేరును జోడించిన తర్వాతే ఆయన పవర్‌స్టార్ అయ్యాడు. అలా ఆ కుటుంబంలోని వారిలో హనుమంతుని పేరు ఉన్న వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనే నమ్మకం ఉంది. నేడు అందరు పీఎస్‌పీకే... అని, పీకే అని పిలుస్తున్నా.. కళ్యాణ్‌బాబు నుంచి పవన్‌కళ్యాణ్‌గా మారిన తర్వాతే ఆయన దశ,దిశ తిరిగాయి. ఎవరు సెంటిమెంట్లను నమ్మినా నమ్మకపోయినా వీరిద్దరు పేర్లను చూస్తే మాత్రం ఆ సెంటిమెంట్‌పై ప్రగాడమైన నమ్మకం ఏర్పడటం ఖాయం.
ఇక విషయానికి వస్తే పవన్‌కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలు కలిసి మాట్లాడుకుంటూ ఆయా ఫొటోలు వైరల్ అవుతుంటాయి. పవన్‌కళ్యాణ్ బర్త్‌డే రోజున ఆయన చిరంజీవితో కలిసి అప్పుడెప్పుడో కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన ‘థమ్సప్‌యాడ్’ నాటి గోల్కోండలో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. ఇక పవన్‌కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనకు తన తమ్ముడిపై ఉన్న అభిమానాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు. కొణిదెల బేనర్ సంస్థ ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.. కళ్యాణ్‌బాబు...!నువ్వు అందుబాటులో లేవని తెలిసింది. అందుకే కలవాలని భావించి విరమించాను. పుట్టినరోజు శుభాకాంక్షలు...ఆ హనుమాన్ నీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.. అంటూ తెలిపాడు. పవన్ తన బర్త్‌డేలను పెద్దగా జరుపుకోడనే విషయం తెలిసిందే.