Advertisementt

అక్కినేని ఫ్యామిలీ హీరోల మధ్య భలే పోటీ!

Mon 03rd Sep 2018 11:31 PM
akkineni family heroes,nagarjuna,sumanth,samantha,chaitu,release movies  అక్కినేని ఫ్యామిలీ హీరోల మధ్య భలే పోటీ!
Interesting Fight between Akkineni Family Heroes అక్కినేని ఫ్యామిలీ హీరోల మధ్య భలే పోటీ!
Advertisement
Ads by CJ

ఇప్పటికే నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ అక్కినేని కోడలు సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘యూటర్న్‌’ చిత్రాలు రెండు ఒకదానితో మరోటి పోటీ పడేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కినేని కాంపౌండ్‌ నుంచే మామా అల్లుళ్లు కూడా పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి ‘దేవదాస్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వైజయంతీ బేనర్‌లో అశ్వనీదత్‌ నిర్మిస్తుండగా, ‘భలే మంచిరోజు, శమంతకమణి’ చిత్రాల దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. 

నాగార్జునకు జోడీగా నాగార్జున మేనల్లుడు సుమంత్‌ నటించిన ‘మళ్లీరావా’ హీరోయిన్‌ ఆకాంక్షసింగ్‌ నటిస్తుండగా, ‘ఛలో’లో నాగశౌర్యతో, ‘గీతగోవిందం’లో విజయ్‌దేవరకొండ సరసన నటించిన రష్మికామండన్న నానికి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ కూడా పూర్తయింది. దీనిని సెప్టెంబర్ 27 వతేదీన విడుదల చేస్తామని ఇప్పటికే అనౌన్స్‌ చేశారు.

మరోపక్క ‘మళ్లీరావా’తో ఫామ్‌లోకి వచ్చిన అక్కినేని కాంపౌండ్‌ హీరో, నాగార్జున మేనల్లుడు సుమంత్‌ నటిస్తున్న ‘ఇదంజగత్‌’ని వచ్చే సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య-సమంతలు, నాగార్జున-సుమంత్‌ల మద్య బాక్సాఫీస్‌ పోటీ ఏర్పడనుందా? లేదా అనేది వేచి చూడాల్సివుంది...! 

Interesting Fight between Akkineni Family Heroes:

Nagarjuna Vs Sumanth Fight in September 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ