Advertisementt

టాక్సీవాలాపై విజయ్ కాన్ఫిడెంట్‌గా లేడా?

Tue 04th Sep 2018 02:29 PM
vijay deverakonda,taxiwala,producer,rumours  టాక్సీవాలాపై విజయ్ కాన్ఫిడెంట్‌గా లేడా?
Producers vs Vijay Deverakonda on Taxiwala టాక్సీవాలాపై విజయ్ కాన్ఫిడెంట్‌గా లేడా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'..'గీత గోవిందం' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ బయటికి చాలా హ్యాపీగా కనపడిన లోపల మాత్రం చాలా ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తుంది. 'గీత గోవిందం' కన్నా ముందు రిలీజ్ అవ్వాల్సిన 'టాక్సీ వాలా' ఇంకా రిలీజ్ కాలేదు. ఏవేవో కారణాలు చెప్పి రిలీజ్ ను వాయిదా వేస్తున్నారు. మరోపక్క ఇది టిపికల్ స్టైల్లో రూపొందిన సినిమా కాబట్టి అందరూ కనెక్ట్ కాకపోవచ్చు అనే డౌట్ హీరో నుండి నిర్మాతల వరకు ఉందంట.

అయినా కూడా నిర్మాతలు 'గీత గోవిందం' సక్సెస్ చూపుతూ 'టాక్సీ వాలా'ని అమ్మాలని చూస్తున్నారట. అయితే హీరో విజయ్ మాత్రం దీన్ని నేరుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేద్దాం అని చెప్పాడట. కానీ నిర్మాతలు అందుకు ఒప్పుకోవడంలేదని తెలుస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమా మంచి రేట్స్ కే అమ్ముడవుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు.

సో విజయ్ చెప్పిన దాన్ని నో చెప్పారు నిర్మాతలు. పెద్ద నిర్మాణ సంస్థలు అయిన గీతా ఆర్ట్స్, యువి సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'టాక్సీ వాలా'కు విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. థియేటర్స్ కొరత కూడా ఉండదు కాబట్టి క్రేజ్ దృష్ట్యా బిజినెస్ జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నారట నిర్మాతలు. సో దీనినిబట్టి చూస్తుంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవ్వబోతుంది. పలుమార్లు రీషూట్ తర్వాత  డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమా అవుట్ ఫుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని టాక్. మరి రిలీజ్ అవ్వుతుందా? లేదా? అన్న విషయాలపై మరో రెండు వారాల్లో ఓ క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఒకవేళ ఇది రిలీజ్ కాకపోతే 'నోటా' సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది.

Producers vs Vijay Deverakonda on Taxiwala:

Rumours on Taxiwala movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ