Advertisementt

ఎన్టీఆర్ పై థమన్ ఆసక్తికర ట్వీట్!

Tue 04th Sep 2018 04:08 PM
jr ntr,tarak anna,ss thaman,lots of respect  ఎన్టీఆర్ పై థమన్ ఆసక్తికర ట్వీట్!
Thaman's Respect on NTR ఎన్టీఆర్ పై థమన్ ఆసక్తికర ట్వీట్!
Advertisement
Ads by CJ

నందమూరి హరికృష్ణ అకాల మరణంతో నందమూరి ఫ్యామిలీ మొత్తం కన్నీరుమున్నీరు అయింది. ఆయన మరణంతో బాలకృష్ణ నుండి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వరకు అంత తమ సినిమాల షూటింగ్ ఆపేసుకున్నారు. బాలకృష్ణ మూడు రోజులు తర్వాత నిన్న ఉదయం నుండి 'ఎన్టీఆర్' బయోపిక్ కు హాజరైయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న టైములో హరికృష్ణ మరణ వార్తతో షూటింగ్ ఆపేశారు మేకర్స్.

ఎన్టీఆర్  మానసికంగా కోలుకునేవరకూ ఈ సినిమా షూటింగ్ వాయిదా పడొచ్చని చెప్పుకున్నారు. దాదాపు 15 రోజులు బ్రేక్ తీసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దాంతో సినిమా దసరాకు కష్టమే అని చెప్పుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ నిన్నటి నుండి రెగ్యులర్ షూటింగ్ కి హాజరైయ్యారు. తన కారణంగా షూటింగ్ ఆగిపోకూడదనీ .. విడుదల వాయిదా పడకూడదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ .. తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'అంకిత భావానికి ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం .. ఆయన డెడికేషన్ చూశాక ఆయనపై మరింత గౌరవం పెరిగింది' అంటూ సంగీత దర్శకుడు తమన్ ఒక ట్వీట్ చేశాడు. 'మేము అంత నీతో ఉన్నాం.. మీకు మరింత బలం చేకూరాలి' అంటూ తమన్ లొకేషన్లోని ఎన్టీఆర్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో గురించి తనకు సినిమాపై ఉన్న డెడికేషన్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు.

Thaman's Respect on NTR:

Lots of Respect to Tarak Anna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ