టాలీవుడ్‌లో ప్రస్తుతం రీషూట్స్ గోల ఎక్కువైపోయింది. విజయ్ దేవరకొండ ‘టాక్సీ వాలా’ నుండి నాగ చైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ వరకు అన్ని రీషూట్స్ జరిగిన సినిమాలే. సినిమా రషెస్ చూసి వాటికి మంచి కరెక్షన్ చెప్పే వారిలో అల్లు అరవింద్ - దిల్ రాజు - నాగార్జునలు ముందు ఉంటారు. వారు అలా చాలా సినిమాలకి చేశారు. అయితే లేటెస్ట్‌గా ‘శైలజా రెడ్డి అల్లుడు’ విషయంలో నాగార్జున.. వేలు పడ్డట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
సినిమాలో కొన్ని సీన్స్ తో పాటు చిన్నపాటి ప్యాచ్ వర్క్ ను నాగ్ సూచించడం జరిగిందట. నాగ్ చెప్పిన చిన్నపాటి సీన్స్ వెన్నెల కిషోర్ కి సంబంధించినవి అంట. కానీ వెన్నెల కిషోర్ విదేశాల్లో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎలాగో సమయం దొరికింది కదా అని ఆయనను విదేశాలు నుండి పిలిపించి మరి షూట్ చేశారట. ఈ ప్యాచ్ వర్క్ మొత్తం మూడు రోజుల్లో ఫినిష్ చేసి నాగ్ కి చూపించినట్లుగా తెలుస్తుంది.
నాగ్ ఆ వర్క్ చూసి ఎడిటింగ్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులు చెప్పి సినిమా ఫైనల్ కాపీని రెడీ చేసినట్టు సమాచారం. నాగ చైతన్యకు ఈ సినిమా చాలా కీలకం కాబట్టి నాగ్ సీన్ లోకి ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. మారుతీ సినిమా కాబట్టి ఇది పక్కా హిట్ అవుతుందని యూనిట్ తో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమా ఈనెల 13న రిలీజ్ అవ్వబోతుంది.