Advertisementt

‘రెడ్ మిర్చీ’కి రిలీజ్ డేట్ ఫిక్స్

Tue 11th Sep 2018 10:55 PM
red mirchi movie,release date,veena malik,september 28  ‘రెడ్ మిర్చీ’కి రిలీజ్ డేట్ ఫిక్స్
Veena Malik Red Mirchi Movie Release Date Fix ‘రెడ్ మిర్చీ’కి రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

పాకిస్థాన్ కథానాయకి వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెడ్ మిర్చీ’.  కన్నడలో తెరకెక్కిన ‘సిల్క్’ చిత్రం.. కన్నడ సినీ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పి, 25 కోట్లు వసూలు చేయడమే కాకుండా, 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రెడ్ మిర్చీ’ పేరుతో..  పి.వి.యన్ సమర్పణలో నైన్ మూవీస్ సంస్థ అందిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత కరణ్ మాట్లాడుతూ.. ‘‘కన్నడ చిత్ర సీమలో సెన్సేషనల్ విజయంతో టాక్‌ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సెన్సార్ చిక్కులను అధిగమించిన మా ‘రెడ్ మిర్చీ’ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నాము. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం.. ’’ అన్నారు.

వీణామాలిక్, అక్షయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో సన, షఫీ, సాదుకోకిల, అవినాష్ మొదలగువారు నటించారు. 

ఈ చిత్రానికి సంగీతం: జెస్సీగిఫ్ట్స్, కెమెరా: జైఆనంద్, ఎడిటర్: సంజీవరెడ్డి, మాటలు,పాటలు: భారతీబాబు, సమర్పణ: పి.వి.యన్, విడుదల: యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత: కరణ్, దర్శకత్వం: త్రిశూల్.

Veena Malik Red Mirchi Movie Release Date Fix:

Red Mirchi Movie Release on Sep 28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ